Mahesh Babu, Trivikram: ఆ సినిమాను ఫాలో అవుతున్న త్రివిక్రమ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను రిపీట్ చేసే డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ గత సినిమాలైన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ కథకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. అతడు, ఖలేజా మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోవడంతో ఈ సినిమాతో త్రివిక్రమ్ మహేష్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మహేష్ తో త్రివిక్రమ్ అతడు తరహా కథనే తెరకెక్కించనున్నారని బోగట్టా. ఈ సినిమాలో మహేష్ పాత్ర సీరియస్ గా ఉంటే పూజా హెగ్డే పాత్ర కూల్ గా ఉంటుందని సమాచారం అందుతోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. భీమ్లా నాయక్ విడుదలైన తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్ లో జరుపుకుని భారత్ కు రావాలని మహేష్ భావిస్తున్నారు.

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ సైతం వరుస విజయాలతో జోరుమీదున్నారు. బాక్సాఫీస్ వద్ద మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సంచలనాలను సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశారని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus