Jr NTR: ఎన్టీఆర్ ప్రకటనతో కన్ఫ్యూజన్లో పడ్డ త్రివిక్రమ్..!

‘అల వైకుంఠపురములో’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ రాజమౌళి హీరోల ‘ఆర్.ఆర్.ఆర్’ లెక్క ఇప్పట్లో తేలేది కాదు అని గ్రహించి.. వేరే చిన్న సినిమా చెయ్యాలి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ తో సినిమా అనుకున్నాడు. కానీ అనుకోకుండా పవన్ రిక్వెస్ట్ మేరకు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు రైటర్ గా పనిచేయాల్సి రావడంతో దానిని పక్కన పెట్టాడు. ఈ గ్యాప్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు అని ఎస్టిమేషన్ వేసుకున్నాడు త్రివిక్రమ్.

కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ మళ్ళీ వాయిదా పడింది. దీంతో త్రివిక్రమ్ ప్లాన్ అప్సెట్ అయ్యింది. దాంతో మహేష్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్ తో సినిమా చెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో మూవీ చెయ్యాలి. అది కూడా పూర్తయిన వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఈరోజే అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో త్రివిక్రమ్ లైనప్ కు దెబ్బ పడినట్టు అయ్యింది.

ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు పూర్తి చేసే సరికి 2023 వచ్చేస్తుంది. మరోపక్క బన్నీతో కూడా సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ అతను ‘పుష్ప’ రెండు పార్ట్ లు పూర్తి చెయ్యాలి. సుకుమార్ కూడా తొందరగా ఫినిష్ చేసే రకం కాదు. కాబట్టి.. మహేష్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక.. రామ్ లాంటి హీరోతోనే సినిమా చేసుకుంటే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే మిగిలిన స్టార్ హీరోలు ఎవ్వరూ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా కనిపించడం లేదు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus