మహేష్- త్రివిక్రమ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి ఎండింగ్ నుండీ మొదలయ్యింది. పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం తరువాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేసేది.. ఇంకా ఫైనల్ చెయ్యలేదు.ఎలాగు రాజమౌళితో సినిమా చెయ్యాలి కాబట్టి.. దాని ప్రీ ప్రొడక్షన్ పనులకు 6 నెలల పైనే టైం పడుతుంది. రాజమౌళి ఇంకా ఎక్కువ టైమే తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదిలా ఉంటే.. నిజానికి ‘సర్కారు వారి పాట’ కు ముందే త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి చాల ఇంట్రెస్ట్ చూపించి.. ఎక్కువ రోజులు వెయిట్ చేసాడట మహేష్. కానీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో రెడీగా లేడు.

ఎన్టీఆర్, రామ్ తో సినిమాలు అనుకున్నాడు కానీ అవి వర్కౌట్ కాలేదు. మే తరువాత ఎన్టీఆర్ సినిమా మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. దానిని 6 నెలల్లో కంప్లీట్ చేసి తరువాతి చిత్రాన్ని మొదలుపెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కాబట్టి మహేష్ తో సినిమా చెయ్యాలనే ఇప్పుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. స్క్రిప్ట్ పైన కూడా ఫోకస్ పెట్టాడని టాక్. ఈ ప్రాజెక్టుని ‘హారిక అండ్ హాసిని’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించే అవకాశం ఉందట. మహేష్- త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus