మొత్తానికి వెంకటేష్ కి హ్యాండిచ్చేసాడుగా..!

అప్పుడెప్పుడో తరుణ్ లాంటి యువ హీరోతో ‘నువ్వే నువ్వే’ చిత్రం చేసాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్ ల తో రెండేసి సినిమాలు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూడు చిత్రాలు తెరకెక్కించాడు. మధ్యలో నితిన్ తో ‘అఆ’ లాంటి మరో చిన్న చిత్రాన్ని చేసి మళ్ళీ జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తో ‘అరవింద సమేత’ తో చేసాడు. విషయంలోకి వెళితే త్రివిక్రమ్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.

కేవలం స్టార్ హీరోలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవడం… వాళ్ళు డేట్స్ ఇచ్చే వరకు ఖాళీగా ఉండటం వంటి విషయాల పై త్రివిక్రమ్ పై చర్చలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ చిత్రం చేస్తున్నప్పుడే విక్టరీ వెంకటేష్ తో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నట్టు అనౌన్స్ చేసాడు. ఇక షూటింగ్ కూడా మొదలయ్యి పోతుందనుకున్నారు అంత. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక చిత్రం చేయడానికి రంగం సిద్దమయ్యింది. ‘గీతా ఆర్ట్స్’, ‘హారిక & హాసినీ క్రియేషన్స్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక అటు తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు త్రివిక్రమ్. ‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టారే ఈ విషయాన్ని తెలియజేసాడు. ఇలా వెంకటేశ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్ ఇచేసినట్టు తెలుస్తుంది. చూస్తుంటే. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ కేవలం స్టార్ హీరోలను తప్ప, మిగిలిన హీరోలను పట్టించుకోవట్లేదని స్పష్టమవుతుంది. మధ్యలో నితిన్ తో సినిమా చేసింది కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వలనే… అనే సందేహం కలుగక మానదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus