Trivikram Car Cost: త్రివిక్రమ్ కొత్త కారు ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తుండగా మహేష్ వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే తాజాగా త్రివిక్రమ్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు.

త్రివిక్రమ్ కొనుగోలు చేసిన ఈ కారు ధర ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ ఈ తరహా విషయాలను మీడియాకు తెలియజేయడానికి ఇష్టపడరు. అయితే సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీఎండబ్ల్యూ కారును త్రివిక్రమ్ కొనుగోలు చేయగా ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ కొత్త కారు బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు త్రివిక్రమ్ మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఫ్యామిలీ కథలకు ఈ దర్శకుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఒకే తరహా కథలతో చాలా సంవత్సరాల పాటు త్రివిక్రమ్ కెరీర్ ను కొనసాగించారు.

మరోవైపు త్రివిక్రమ్ భార్య నిర్మాతగా కూడా కెరీర్ ను కొనసాగించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్రివిక్రమ్ రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ డైరెక్షన్ లో వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి. త్రివిక్రమ్ కు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus