SSMB28: త్రివిక్రమ్ రిలీజ్ టార్గెట్.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్లో ఒకటైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న వీరు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులు క్రియేట్ చేయలేదు గాని ఆడియెన్స్ ను మాత్రం బాగానే ఎట్రాక్ట్ చేశారు. అతడు సినిమా ఇప్పటికి టీవీలలో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుంది. ఇక మహేష్ బాబుతో మరో సినిమా చేయలని త్రివిక్రమ్ గత ఆరేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

ఇక ఫైనల్ గా ఈ ఏడాదికి వారి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి ప్రణాలికను త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలోనే సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మేయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసేశారు. ఇక మరొక హీరోయిన్ విషయంలో కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ డేట్ పై కూడా త్రివిక్రమ్ ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి 2023 జనవరి 6న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ మొదటి వారంలోనే స్టార్ట్ చేసి ఇదే ఏడాది నవంబర్ లోగా మొత్తం షూటింగ్ పనులు ఫినిష్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఆ సినిమా పనులన్నీ అయిపోవడానికి మరో రెండు వారాలు పట్టె అవకాశం ఉంది.

డబ్బింగ్ వర్క్ ఏప్రిల్ లో త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చినప్పుడు పూర్తి చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ మహేష్ అయితే SSMB28 పనులన్నీ ఇదే ఏడాది పూర్తి చేయలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక త్రివిక్రమ్ త్వరలోనే మరొక హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus