సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడుతుంది. పవన్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉందనే విషయం కూడా తెలిసిందే.
పవన్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడటానికి త్రివిక్రమ్ ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ అయిన భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ కీలక మార్పులు చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా అందించారనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు.
అయితే ఏప్రిల్ నెల నుంచి మహేష్ బాబు సినిమాతో త్రివిక్రమ్ బిజీ కానున్నారు. పవన్ తాజాగా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వినోదాయ శితం అనే సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఈ సినిమా కథ, కథనంలో కీలక మార్పులు చేయనున్నారని బోగట్టా. పవన్ సినిమాకు త్రివిక్రమ్ పేరు యాడ్ అయితే సినిమాపై క్రేజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. పవన్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగుతున్నారు.
అయితే పవన్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా మహేష్ త్రివిక్రమ్ అభిమానులు ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!