Trivikram Remuneration: త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలలో అతడు హిట్టైతే ఖలేజా మాత్రం భిన్నమైన ఫలితాన్ని అందుకుంది. కొంతమంది ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చినా మహేష్ దేవుడు అనేలా చూపించడం వల్లే ఆ సినిమా ఫ్లాపైందని చాలామంది భావిస్తారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు వరుస విజయాలతో జోరుమీదున్నారనే సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోవడంతో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్సైంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. దర్శకుడిగా త్రివిక్రమ్ కళ్లు చెదిరే మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో కొంతమంది డైరెక్టర్లు మాత్రమే ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు. మహేష్ తో తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే త్రివిక్రమ్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ అడిగితే తన డైరెక్షన్ లో నటించడానికి తెలుగులో ఏ హీరో నో చెప్పే అవకాశం లేదు. త్రివిక్రమ్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే అవకశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి ఈ మేరకు క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కోసం సరికొత్త కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం మహర్షి సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus