Trivikram, Soujanya: తన సొంత ఊరిలో త్రివిక్రమ్ సందడి.. ఆ కారణంతోనే వచ్చాడట..!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కాళ్ళకూరు లో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మరియు అతని సతీమణి సౌజన్య హాజరవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి అయిన ముదునూరి సత్యనారాయణ రాజు మరియు ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఈ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని నేను ప్రతి ఏటా దర్శించుకునేందుకు వస్తుంటాను’ అంటూ ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. అనంతరం ఆలయ కార్యకర్తలు ఈ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి పంపించారు. త్రివిక్రమ్ భీమవరానికి చెందిన వ్యక్తే అని అందరికీ తెలిసిన సంగతే.

ఇక సినిమాల పరంగా.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘భీమ్లా నాయక్’ కి రైటర్ గా పనిచేశాడు త్రివిక్రమ్. ఇక త్వరలో మహేష్ బాబు తో అతను ఓ చిత్రం చేయబోతున్నాడు. తనకు సొంత బ్యానర్ వంటి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో నిర్మించబడుతున్న సినిమాలకు తన భార్య సౌజన్య పేరుపై స్థాపించిన ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ సంస్థ పై సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు త్రివిక్రమ్.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus