Trivikram: పాన్‌ ఇండియా ‘రామాయణం’… త్రివిక్రమ్‌ మాటల్లో… నిజమేనా?

  • April 4, 2024 / 04:06 PM IST

దేశ సినిమా సర్కిల్స్‌లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న అతి పెద్ద కబురు ‘రామాయణం’. గతంలో ఈ పేరు వినగానే రాజమౌళి (S. S. Rajamouli) చెప్పిన ప్రాజెక్ట్‌ గుర్తొచ్చేది. ఆయన ఇంకా టైమ్‌ ఉందని చెప్పడంతో.. కాస్త కామ్‌ అయిన చర్చ… నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) సినిమా ఊసులు రావడంతో మళ్లీ మొదలైంది. చాలా పెద్ద కాస్టింగ్‌తో చర్చల్లో నిలిచిన ఈ సినిమా ఇటీవల మొదలైందట. ముంబయిలోని ఓ స్టూడియోలో ఈ సినిమా స్టార్ట్‌ చేశారు అని బొంబాయి టాక్‌. అయితే ఆ సినిమా తెలుగు వెర్షన్‌కు త్రివిక్రమ్‌ (Trivikram) డైలాగ్స్‌ రాశారు అనేది లేటెస్ట్‌ టాక్‌.

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, యశ్‌ (Yash) రావణుడిగా, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమాకు నితేశ్‌ తివారీ దర్శకుడు. భారీ జనసమూహం నేపథ్యంలో సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందట. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి వివరాలు శ్రీరామనవమి (ఏప్రిల్‌ 17) నాడు భారీ కార్యక్రమం ఒకటి నిర్వహించిన అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్‌ సంభాషణలు త్రివిక్రమ్‌ భుజానేసుకున్నారనే విషయమూ చెబుతారు అంటున్నారు. మాటల రచయితగా ఇంకా చెప్పాలంటే మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్‌ ఎంతటి టాలెంటెడ్‌ అనేది మనకు తెలిసిందే.

ఆయన మాటల్లో పురాణాలు, ఇతిహాసాల టచ్‌ కచ్చితంగా ఉంటుంది. అలాంటిది ఆయన ఏకంగా ‘రామాయణ’కే మాటలు రాయడం ఆసక్తికరమే. నిజానికి ఆయన అల్లు అరవింద్‌ నిర్మించనున్న ‘రామాయణం’ ప్రాజెక్ట్‌కి మాటలు రాస్తున్నారని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గ్యాప్‌లోనే త్రివిక్రమ్‌ ఈ పనులు షురూ చేశారని, ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమాను కాస్త పక్కనపెట్టి ఈ సినిమాల పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

అందుకే బన్నీ తన నెక్స్ట్‌ మూవీ ముందుగా అన్నట్లు గురూజీకి కాకుండా అట్లీకి ఇస్తున్నారు అని టాక్‌. ఈ విషయంలో క్లారిటీ ఏప్రిల్‌ 8న బన్నీ (Allu Arjun) పుట్టిన రోజు నాడు వచ్చేస్తుంది. అయితే గురూజీ ఎలాంటి మాటలు రాస్తారు అని నెటిజన్లు ఇప్పటికే ఓ లెవల్‌లో ఊహించుకుంటున్నారు. ఎందుంకటే ఆయన దర్శకునిగా సినిమాలు పోవచ్చు. కానీ ఆయన రైటింగ్‌ ఎప్పుడూ ఫ్లాప్‌ అవ్వలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus