మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. త్రివిక్రమ్ ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే పవన్ కళ్యాణ్ సినిమాలకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు సంబంధించి త్రివిక్రమ్ భార్య సౌజన్య జోక్యం ఎంతవరకు ఉంటుందని తాజాగా నిర్మాత నాగవంశీకి ప్రశ్న ఎదురైంది.
సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి తమ బ్యానర్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ఎదురు కాగా నాగవంశీ సమాధానమిచ్చారు. తమ బ్యానర్ నిలబడటానికి కారణం త్రివిక్రమ్ అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కుతున్నాయని ఇతర డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను సితార బ్యానర్ పై నిర్మిస్తున్నామని నాగవంశీ వెల్లడించారు.
ప్రతిభ ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే మంచి ఆలోచనతో త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ ను మొదలుపెట్టారని నాగవంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య ప్రొడక్షన్ లోకి రారని ఆయన తెలిపారు. సినిమా కథ వింటారని మార్పులు, సూచనలు ఏవైనా ఉంటే చెబుతారని నాగవంశీ పేర్కొన్నారు. సౌజన్య స్క్రిప్ట్ పనులు మాత్రమే చూసుకుంటారని నిర్మాణ బాధ్యతలను మాత్రం చూసుకోరని నాగవంశీ వెల్లడించడం గమనార్హం.
సాయి సౌజన్య (Soujanya) నిర్మాతగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మ్యాడ్ సినిమాతో సాయి సౌజన్య ఖాతాలో మరో సక్సెస్ చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల నిర్మాణం దిశగా సాయి సౌజన్య అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కథల ఎంపికలో త్రివిక్రమ్ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఈ బ్యానర్ కు వరుస విజయాలు దక్కుతున్నాయి.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!