ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ.. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ వచ్చి ఇండస్ట్రీలో అందరినీ ఒక పేజ్ లో ఉంచేవారు. అయితే ఆయన మరణం తరువాత ఆ స్థానం ఎవరిది..? అనేది మాత్రం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే కరోనా అలాంటి విపత్కర పరిస్థితుల్లో విరాళాలు సేకరించి సెలబ్రిటీల సహకారంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా క్రైసిస్ సమయంలో అందరు హీరోలకు ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
దీంతో అందరి చూపు చిరంజీవిపై పడింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు చాలా మంది సీనియర్స్ చెప్పేశారు. మరోపక్క దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద మోహన్ బాబు అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సినీ పెద్దరికంపై చిరంజీవి రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద అనే హోదా తనకు అవసరం లేదని..
కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా.. అందుబాటులో ఉంటానని మెగాస్టార్ అన్నారు. ఇంతలో ‘సినిమాని బతికిద్దాం’ అంటూ టికెట్ రేట్ ఇష్యూపై మోహన్ బాబు రాసిన లెటర్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయం హాట్ టాపిక్ అవ్వడంతో దర్శకుడు అజయ్ భూపతి రంగంలోకి దిగి మధ్యలో రామ్ గోపాల్ వర్మ పేరుని ప్రస్తావించారు. ‘మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.
సామీ మీరు రావాలి సామీ’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు అజయ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన కామెంట్స్ చేస్తూ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!