ఒక నెగిటివ్ డిబేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోవడంతో, ఈ సినిమా ఫలితానికి పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) కూడా కారణంగా చూపిస్తున్నారు. రాజమండ్రి ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చినందునే సినిమా ఫెయిల్ అయిందని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదేమి మొదటిసారి కాదు.
‘రిపబ్లిక్,’ (Republic) ‘సైరా నరసింహా రెడ్డి,’ (Sye Raa Narasimha Reddy) ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) వంటి సినిమాల ఈవెంట్స్‌కు పవన్ వెళ్లడం, అవి ఫ్లాప్ కావడంతో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ట్రెండ్ అభివృద్ధి చెందుతోందనెలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదే వాదనను పరిగణలోకి తీసుకుంటే, ఆయన గెస్ట్‌గా వెళ్లిన ‘జులాయి,’ (Julayi) ‘అ ఆ (A Aa),’ ‘మగధీర’ (Magadheera) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. అప్పుడు ఈ లాజిక్ ఎందుకు వర్తించదు?
‘గేమ్ ఛేంజర్’ విషయంలో అసలు సమస్య కంటెంట్. సినిమా బలహీనంగా ఉంటే, ఏ స్టార్ నటుడో, గెస్ట్‌గా వచ్చిన అతిథినో కారణం చూపడం కాదు. సంక్రాంతి హాలీడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో ‘డాకు మహారాజ్,’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రాలు విజయం సాధించాయి. అయితే ‘గేమ్ ఛేంజర్’ మాత్రం ప్రేక్షకుల మనసులను దోచుకోలేకపోయింది. ఇంకా, పవన్ పాల్గొన్న మొదటి డిప్యూటీ సీఎం ఈవెంట్ కావడం వల్లే ఈ సినిమా మంచి హైప్ పెరిగింది.
కంటెంట్ బాగుండి ఉంటే కలెక్షన్లు ఒక రేంజ్ లో వచ్చేవి. ఇక ‘గేమ్ ఛేంజర్’ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయినా, ఇది రామ్ చరణ్ కెరీర్‌లో డిజాస్టర్ దెబ్బ కొట్టింది. కానీ పవన్ వల్లే సినిమా ఫెయిల్ అయ్యిందని వాదించడం అర్థహీనమే. మొత్తం మీద, మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ సినిమా హాళ్లకు రావడం ఖాయం. సినిమా బాగాలేకపోతే, ఎంత పెద్ద స్టార్లేనా, ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండదు.