దీన్ని స్నేహమంటారా..? రాహుల్ సిప్లిగంజ్ పై ట్రోల్స్!

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షో తరువాత రాహుల్ కి పలు షోలలో అవకాశాలు వస్తున్నాయి. అలానే సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. కృష్ణవంశీ రూపొందిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. తను సంపాదిస్తోన్న డబ్బుతో ఓ బిజినెస్ మొదలుపెట్టాడు. ‘ఊకో కాక’ అనే పేరుతో బట్టల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇటీవల కరీంనగర్ లో ఈ షోరూం ని ప్రారంభించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో హైదరాబాద్ లో ఓ కొత్త షాప్ ని ఓపెన్ చేశాడు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డి అతిథిగా విచ్చేసింది. ఈ సందర్భంగా రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోని షేర్ చేసి కొన్ని వ్యాఖ్యలు రాసుకొచ్చాడు. ”నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునే వాళ్లే నిజమైన స్నేహితులు.. ఊకో కాకా స్టోర్ ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న అషుకి స్వాగతం. మజాక్ కాదు.. కాకా ఫ్రెండ్ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది” అంటూ తెలంగాణ యాసలో రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ కి అషుని ఎత్తుకున్న ఫోటోని యాడ్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రాహుల్ ని ట్రోల్ చేస్తున్నారు. దీన్ని స్నేహమంటారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదంటూ సజెషన్స్ ఇస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ పోస్ట్ కోసం కొందరు అభిమానులను ట్యాగ్ చేశాడు రాహుల్. వాళ్లు కూడా రాహుల్ ని తిట్టిపోస్తున్నారు. దీన్ని స్నేహమంటే ఒప్పుకోమని.. ఏదో తేడా కొడుతోందంటూ నేరుగా కామెంట్లు చేస్తున్నారు.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus