Narappa Movie: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొత్తగా చేసిందేంటి?

Ad not loaded.

వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన ‘నారప్ప’ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది కూడా..! తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ కు ‘నారప్ప’ రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను ఆకర్షించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో చాలానే ఉంటాయి. విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆ విషయాన్ని స్పష్టంచేసింది. అయితే ఆల్రెడీ ‘అసురన్’ చూసేసిన వాళ్ళకి ఇది కొత్తగా ఏమీ అనిపించదు. వాళ్లకి ఇది ఫ్లాట్ గా అనిపించొచ్చు.

అందుకు కారణం దాదాపు అక్కడ ట్రైలర్ ను ఎలా కట్ చేసారో ఇక్కడ కూడా దాదాపు అదే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. కాబట్టి.. చూసిన సీన్లనే మళ్ళీ చూస్తున్నట్టు వారికి అనిపించవచ్చు. అయితే సంభాషణలు బాగానే ఉంటాయనిపిస్తుంది.ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను చేసే శ్రీకాంత్ అడ్డాలకు ఈ చిత్రం రీమేక్ బాధ్యతలను అప్పగించడంతో.. అతని మార్క్ తో ఈ సినిమాలో చాలా మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ అక్కడిది..

ఇక్కడికి కాపీ పేస్ట్ చేసినట్టే ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో శ్రీకాంత్ అడ్డాల కొత్తగా చేసింది ఏమీ లేదు అని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను ప్లాపుల నుండీ గట్టెక్కించడం కోసమే ఈ సినిమాని నిర్మించి ఉంటారు అనే గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే ‘నారప్ప’ ను బట్టి తెలుస్తుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus