కొరటాల శివ.. అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో ఇతని పేరు కూడా ఉంది. రాజమౌళి సినిమాల తర్వాత మరో దర్శకుడి సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయి అని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు అంటే అవి కొరటాల శివ సినిమాలు అనే చెప్పాలి. ‘మిర్చి’ తో మొదలైన ఈయన ప్రయాణం ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఈయన చేసిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.
ఇది ఈయనకి 5 వ చిత్రం. ఇక 6వ చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. దానిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్టు కూడా కొరటాల వెల్లడించారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ అందరిలో జోష్ నింపుతున్న కొరటాల.. ఆయన కెరీర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. కొంతమంది పెద్దల వద్ద ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.
విషయం ఏంటంటే.. కొరటాల శివ కేవలం 10 సినిమాలకి మాత్రమే దర్శకుడిగా పనిచేస్తానని చెప్పారట. ఇప్పటికే 5 సినిమాలు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ తో 6 వ చిత్రాన్ని చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఓ మూవీ బ్యాలన్స్ ఉంది.ఆ రకంగా చూసుకుంటే ఇవి కాకుండా ఇంకో 3 సినిమాలు మాత్రమే కొరటాల చేస్తారని తెలుస్తుంది. వాటిలో హీరోలుగా ఎవరు ఎంపికవుతారు అనే విషయాన్ని పక్కన పెడితే.. తన 10 సినిమాలు పూర్తయ్యాక నిర్మాతగా తన కెరీర్ ను కొనసాగించాలని ఈయన అనుకుంటున్నారట.
ఈయన శిష్యులకి దర్శకులుగా తీర్చిదిద్దాలని ఈయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా కొరటాల తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. ఓ దర్శకుడి పై కోపంతో డైరెక్టర్ అవ్వాలనే కసి పెరిగిందని, తన దగ్గర ఉన్న 10 కథలు తీసి సినిమాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం డిస్కషన్లు జరగడం షాకిచ్చే అంశం.