దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు అన్నాడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,విజన్ వివికే వి.విజయ్ కుమార్ గారు టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ ను ఉచితంగా అందిస్తున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది.సాంసృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సభకు ముఖ్య అతిధులు వచ్చిన సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యే గోపీనాథ్, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంకా వీరితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి,జాయింట్ లేబర్ కమీషనర్ గంగాధర్,బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, నటులు జాకీ, హరిత , ధనలక్ష్మి,, కల్పన, సుష్మ,సింగర్స్, మరియు సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
అనంతరం విజన్ వివికే వి. విజయ్ కుమార్ గారూ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారి చేతుల మీదుగా అందజేశారు
ఈ సందర్బంగా.విజన్ వివికే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసే సేవ ఎవరికైతే మాటిచ్ఛా మో వారికి అందితే చాలు తీసుకున్న వారికి ఇచ్చిన వారికి తెలిస్తే చాలు బహిరంగంగా అక్కర్లేదు అని రమణాచారి గారితో చెపితే.. లేదు ఇలాంటి మంచి విషయం అందరికీ తెలవాలని నాగబాల సురేష్ గారు వారి సభ్యులు ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదములు తెలుపు కుంటున్నాను.ఈ కార్యక్రమానికి , మినిష్టర్ తలసాని,ఎమ్మెల్యే గోపినాథ్ తో పాటు పలువురు పెద్దలు రావడం చాలా సంతోషంగా ఉంది.గత సంవత్సరం టివి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో ఒక నివేదన సభ జరిగితే అక్కడకు మినిస్టర్స్, ఎమ్మెల్యే లు, ఐ ఏ యస్, ఐ. పి. యస్ ఆఫీసర్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులు వారి కష్టాలు, కన్నీళ్లు చెపుతూవుంటే నా మనసు చాలా చలించిపోయింది.మనం ఎంతసేపు నేను నా పిల్లలు, వారి పిల్లలు అంటూ కుటుంబ మొత్తానికి తరతరాలు తిన్నా తరగని కోట్ల ఆస్తిని సంపాదించుకొని వారసత్వంగా ఎన్నో ఆస్తులు పిల్లలకు కూడబెట్టడం కాదు కష్టాలతో వున్న వారికి ఇబ్బందులుతో వున్న వారికి మనం కొంత చేయూత నిచ్చి మనం కొంత సహకరించ గలిగితే చాలు అనేది నా అభిప్రాయం. అయితే నేను టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ లోని ప్రతి క్రాఫ్ట్ నుండి 5 మంది వెనుకబడిన పేద కళాకారులకు ఇస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలని సినీ, రాజకీయ నాయకులు, ఆఫిసియల్స్ మధ్యలో ఇవ్వడం జరిగింది.చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఓక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగ పడే టటువంటి మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం. 2014 లో ప్రగతి నగర్ లో ప్రారంభమైన మా సంస్థ ఈ రోజు అంచె లంచెలుగా ఎదుగుతూ చాలా బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా కు వచ్చే ఆదాయంలో కొంత పేద కళాకారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకోవడమే కాకుండా టివి రంగానికి సంబందించిన పేద కళాకారులను సహాయం చేసే మంచి నిర్ణయం తీసుకున్నాడు.టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లలో వున్న ఒక్కొక్క క్రాఫ్ట్ నుండి ఐదు గురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని 101 ఫ్లాట్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ భూమి సుమారు 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం.పేదవాడి ఆశీర్వాదములు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి .విజయ్ కు వారి ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజీనెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి కె. సి.ఆర్ గారు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ కు కరెంట్ కొరత, నీటి కొరత ఇలా అన్ని రకాలుగా హైదరాబాద్ అందరికీ సౌకర్య వంతంగా ఉంది.
తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తుంది.
సినీ పరిశ్రమ ఇంత ఎదగడానికి ఒక చరిత్ర ఉంది. దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు ఒక కళాకారుడు గా ఒకప్పుడు చెన్నై నగరంలో తెలుగు వారందరూ షూటింగ్ చేస్తున్నపుడు వారిని మాదరాసి అనే వారు. దాంతో తెలుగు గడ్డపై వున్న మమకారం తో అక్కినేని నాగేశ్వరావు, రామారావు లు ఇక్కడికి వచ్చి సినిమా స్టూడియో లను స్థాపించడం జరిగింది.అయితే రామారావు గారు తెలుగు నెలకు నేను ఏమైనా చెయ్యాలని తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేసి భారత దేశ రాజకీయాలను గడ గడ లాడించిన వ్యక్తి రామారావు గారు.ఈ రోజు రామారావు దయావల్ల ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు వచ్చింది అంటే దానికి నందమూరి తారకరామారా వు గారే కారణం. కాబట్టి దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు..అని ఈ సభా ముఖంగా తెలియ జేస్తున్నాను అన్నారు.ఆ తరువాత కార్మిక పక్ష పాతిగా పేదవర్గాల పక్షపాతీగా సినిమా రంగంలో దాసరి గారు ఏది వచ్చినా తన బుజాలమీద వేసుకొని పరిష్కారం ఇచ్చేవారు.
ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ గారు 101 మందికి ఫ్లాట్స్ ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుంది. నేను సినిమా ఇండస్ట్రీ లో ఉన్నా ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.విజయ్ గారు ఈ పని చేయడం గొప్ప విషయం. ఇలాగే ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఈ ప్రభుత్వం ద్వారా పేద వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారిని ఆదుకోవడం జరుగుతుంది.సినిమా ఇండస్ట్రీ కంటే టివి ఇండస్ట్రీ లోని వర్కర్స్ ఎక్కువమంది వున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదృష్టంగా బావిస్తున్నాను అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు రమణా చారి మాట్లాడుతూ..తన జన్మదిన సందర్బంగా 101 మందికి భూదానం చేస్తున్నటు వంటి విజయ్ గారికి ధన్యవాదములు. నేను గత 47ఏళ్లుగా ఎంతో మందిని చూశాను. కానీ మాట తప్పకుండా చేసే టటువంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మంచి మనసుతో ఆలోచించి పేద కళాకారులకు సహాయం చూస్తే వారి అందరి జీవితాల్లో వెలుగును నింపిన వారవుతారు అన్నారు.
నటుడు జాకీ, హరిత మాట్లాడుతూ. విజన్ వివికే “భూదాన” ప్రెసిడెంట్ తెలుగు టెలివిజన్ కార్మికులకు సాంకేతిక నిపుణులకు మరియు కళాకారులకు ఉచితంగా 101 ఫ్లాట్ల అలాట్మెంట్ లెటర్ అందజేయడానికి విచ్చేసిన వినోబాబావే శ్రీమాన్ విజయ్ కుమార్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు అని అన్నారు
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ..1972 లో మొదలైన ఒక్క టివి ఛానెల్ తో నేటికు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఒక్క ఛానల్ తో ప్రారంభమై నేడు తెలుగులో 104 ఛానెల్స్ తో ఈ రోజు టివి రంగం దినాదినాబి వృద్ధి చెందుతుంది. విజయ్ కుమార్ గారి జన్మదినం సందర్బంగా టివి కార్మికులకు ఇళ్ల స్థలాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా కళాకారులకు సహాయం చేయాలని కోరుతున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇది భారత దేశ టీవీ చరిత్రలో టీవీ కళాకారులకు మొట్టమొదటి భూదాన కార్యక్రమమిది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని పలువురు పెద్దలు అభివర్ణించారు అన్నారు.