నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన 4వ సినిమా ‘అఖండ 2’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత 3 సినిమాలు.. ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మార్కెట్ కాస్త డౌన్లో ఉంది అనే టైం వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమాలే ఆ మూడు కూడా. ముఖ్యంగా ‘అఖండ’ అయితే కోవిడ్ టైంలో పెద్ద సినిమాల రిలీజ్ కి లైన్ క్లియర్ చేసింది.
అలాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తుంది అంటే అంచనాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ‘అఖండ 2’ అనౌన్స్ చేసినప్పటి నుండి అదే ఊపు ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో ఉన్నాయి. అయితే ‘అఖండ 2’ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.కానీ విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటివి ఏవీ కూడా మిగతా భాషల్లో ‘అఖండ 2’కి పబ్లిసిటీని తీసుకురాలేకపోయాయి.

కానీ ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ వారు మద్రాస్ హైకోర్టులో వేసిన కేసు వల్ల.. ‘అఖండ 2’ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. బాలయ్య, బోయపాటి.. నార్త్ వెళ్లి ప్రమోషన్ చేసినా రాని బజ్ అంతా ‘ఎరోజ్…’ వారు వేసిన కేసు వల్ల వచ్చింది. ఆ రకంగా చూసుకుంటే ‘అఖండ 2’ కి మంచి జరిగినట్టే. నేషనల్ మీడియా కూడా ‘అఖండ 2’ గురించి స్పెషల్ బుల్లెటిన్లు వేయడం విశేషం.
ఈ వీకెండ్ ‘అఖండ 2’ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నా లేకపోయినా.. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయినా ‘అఖండ 2’ మిగతా భాషల్లో కూడా మంచి ఫుట్ ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది.
