ప్రముఖ నటుడు,జిస్మత్ మండీ అధినేత అయినటువంటి ధర్మ మహేష్ హైదరాబాద్లో ఉన్న చైతన్యపురిలో రెండో బ్రాంచ్ ను ప్రారంభించారు. ఫుడ్ లవర్స్ ని ఆకట్టుకునేలా అలాగే నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో భాగంగా నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మార్చి అతిథి రంగంలో సేవలు అందిస్తున్నాను.

ఈ రీబ్రాండింగ్ అంటే.. గిస్మత్ నుండి జిస్మత్ కు మార్చడం వల్ల నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుంది’ అని తెలిపారు. అలాగే తమ కంపెనీ యాజమాన్యాన్ని కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తూ ఈ ఎక్స్టెన్షన్ పై ముందుచూపు పెట్టినట్టు తెలిపారు.మా ప్రతి బ్రాంచ్ లో ప్రతి బిర్యానీ ప్లేట్ దాని ముందు అతిథుల చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మేము అందించే రుచి, నాణ్యతకి అందరి ఆప్యాయత మా బలాన్ని పెంచుతాయి. దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తాయి అని ఆశిస్తున్నట్టు తెలిపారు ధర్మ మహేష్.
