మొన్నటికి మొన్న హనుమంతుడు గురించి రాజమౌళి ఓ మాట అంటే నేషనల్ మీడియా ఏకి పారేసింది. తన సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ కోసం ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఈవెంట్లో.. సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే రాజమౌళికి కోపం వచ్చి హనుమంతుల వారిమీద అలిగారు. కానీ చాలా మంది హనుమంతుల వారిని అవమానించినట్టు ఫీలయ్యారు.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ జ్యోతి తిరుమలలో చేసిన ఓ ఫన్నీ వీడియోకి టీటీడీ సభ్యులకు కోపం వచ్చి ఆమెను తిరుమల శ్రీవారి సన్నిధికి రాకుండా ఆమె ఆధార్ కార్డు ను బ్లాక్ చేశారు. ఇలాంటి సున్నితమైన అంశాలు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సనాతన ధర్మం విషయంలో ప్రతి ఒక్కరూ అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సనాతన ధర్మం కాన్సెప్ట్..లతో సినిమాలు తీస్తే వాటికి చాలా కష్టాలు వచ్చి పడుతున్నాయి అనేది కొందరి మాట.

అది కూడా పెద్ద హీరోల సినిమాలకి కావడం గమనార్హం.విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి చెందిన హీరోలైన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ పై సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఆ కాన్సెప్ట్ పై రూపొందిన సినిమానే. కానీ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనాల ముందుకు రావడానికి ఎన్నో పురిటినొప్పులు పడింది.
రిలీజ్ టైంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫైనాన్షియర్లు అంతా నిర్మాతపై ఒత్తిడి తీసుకొచ్చారు.అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకేసి తన పారితోషికం వెనక్కి ఇచ్చి.. రిలీజ్ కి లైన్ క్లియర్ చేశారు. ఇప్పుడు ‘అఖండ 2’ విషయానికి వస్తే.. ఇది కూడా సనాతన ధర్మం కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే. హిందువులపై దాడి చేసిన వారికి హీరో ఎలా బుద్దిచెప్పాడు అనే పాయింట్ పైనే మెయిన్ కథ నడుస్తుంది.
అయితే ఈ సినిమా కూడా రిలీజ్ కి చాలా ఇబ్బందులు పడుతుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమా విడుదల నిలిచిపోయింది. సనాతన ధర్మం కాన్సెప్ట్ తో తీసే సినిమాలకి కూడా ఇలాంటి ఆటంకాలు రావడం గమనార్హం
