Actress Sreevani: ఖరీదైన కారును కొన్న నటి శ్రీవాణి.. కారు ధర ఎంతో తెలుసా?

బుల్లితెర సీరియల్స్ లో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో నటి శ్రీవాణి ఒకరు. ఒకప్పుడు ఈమె వరుసగా బుల్లితెర సీరియల్స్ లో నటించి సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈమె సీరియల్స్ కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా

తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమెకు ఏకంగా ఆరు లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వీరికి సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉన్నారు ఇక శ్రీవాణితోపాటు తన భర్త విక్రమ్ కూతురు నందిని కూడా ఎంతో చలాకీగా ఉంటూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఇకపోతే గత నెల రోజుల క్రితం శ్రీవాణి కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా కొత్త కారును కూడా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని శ్రీ వాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. శ్రీవాణి విక్రమ్ దంపతులు 13 లక్షలు విలువ చేసే గ్రాండ్ విట్టారా కారు కొన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఈమె తన వీడియో ద్వారా తెలియజేయడమే కాకుండా,

ఈ కారు కొన్న తర్వాత మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి గుడిలోనే తన తోటి నటీనటులకు పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus