డబుల్ ఎలిమినేషన్ అని హౌస్ మేట్స్ గెస్ చేశారా..! ట్విస్ట్ ఏంటి ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్ మేట్స్ పోటీపడుతున్నారు. ఈ పోటీలో అర్హతని సంపాదించేందుకు గెస్ట్ లు గా వచ్చిన మాజీ హౌస్ మేట్స్ ఇచ్చిన మిస్టరీ బాక్స్ అనేది కీలకమైన రోల్ పోషించింది. దీనివల్ల శివ రెండు సార్లు టాస్క్ లో టాప్ ర్యాంక్ సంపాదించు కూడా అర్హతని సాధించలేకపోయాడు. ఒకసారి స్వాప్ చేసి బిందుని పోటీలో నిలబెట్టిన శివ, ఆ తర్వాత అఖిల్ ర్యాంక్ పైకి పాకడం వల్ల అర్హతని కోల్పోయాడు. దీంతో యాంకర్ శివ చాలా బాధపడ్డాడు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీదారుడిగా అఖిల్ ఎంపిక అయిన తర్వాత హౌస్ లో లెక్కలు మారాయి. అఖిల్ నటరాజ్ మాస్టర్ లో పాస్ ఎవరికి అవసరం అనే దానిపైన డిస్కషన్ పెట్టాడు.

ప్రస్తుతం బాబాభాస్కర్ గెలిచినా కూడా ఈవారం ఎవరినైనా సేఫ్ చేయాల్సిందే కానీ, తనకోసం వాడే ఛాన్స్ లేదని చెప్పాడు. అలాగే, తను గెలిస్తే వేరేవాళ్లకి అవసరం అయితే వాడతాడు అని, అది ఎవరికోసం వాడతాడు అనేది పాయింట్ అంటూ మాట్లాడాడు అఖిల్. ఇదే విషయాన్ని నటరాజ్ మాస్టర్ అషూతో కూడా డిస్కస్ చేశాడు. నేను పోటీలో లేనని, ఈవారం ఎలిమినేషన్ లో లేను అంటూ మాట్లాడాడు. అలాగే, నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరికితే మాత్రం నిన్ను, ఇంకా అఖిల్ నే కాపాడతాను అని కూడా చెప్పాడు. దీంతో అషూకి ఇప్పుడు ఈ పాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్లతో ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది. అలాగే, బాబాభాస్కర్ గెలిస్తే ఈ పాస్ ని మిత్రా కోసం వాడతాడా లేదా అరియానా కోసం వాడతాడా అనేది చాలా ఆసక్తికరం. మరోవైపు అఖిల్ గెలిస్తే ఖచ్చితంగా అషూని సేఫ్ చేసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే, ఎలాగైనా సరే అషూరెడ్డిని టాప్ 5లో పెట్టాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా అషూరెడ్డి డేంజర్ జోన్ లో ఉంటుంది. కాబట్టి, అషూని సేప్ చేసేందుకు బిగ్ బాస్ టీమ్ ఈ ఎవిక్షన్ పాస్ అనే టాస్క్ ని తీసుకుని వచ్చిందని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తునే ఉన్నారు.

మరోవైపు ఈ పాస్ ని బిందుమాధవి గెలిస్తే తనకోసం వాడతుందా లేదా డేంజర్ జోన్ లో శివ ఉంటే శివకోసం ఆడుతుందా అనేది కూడా ఆసక్తికరమే. అలాగే, అనిల్ రాధోడ్ గెలిస్తే ఖచ్చితంగా తనకోసమే తను వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, అరియానా, అనిల్, అషూ ఈ ముగ్గురూ ఇప్పుడు డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. మరీ ఈ వీకండ్ ఎలాంటి ట్విస్ట్ ఉంటుందనేది చూడాలి. అదీ మేటర్.

Share.