పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కి రెడీ అయ్యింది. 5 ఏళ్ళ నుండి ఈ సినిమా సెట్స్ పై ఉంది. దాదాపు 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్టకేలకు జూలై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై నెల రిలీజ్..లను గమనిస్తే, ‘తమ్ముడు’ అంచనాలను అందుకోలేదు. పెద్ద డిజాస్టర్ అయ్యింది. జూలై 11న రావాల్సిన ‘ఘాటి’ మళ్ళీ వాయిదా పడింది.
సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ ఎంతకంతే..! ఆ సినిమా ఆడినా రూ.5 కోట్లకి మించి బిజినెస్ చేయదు. జూలై 18న కూడా సరైన సినిమా లేదు. సో జూలై 24 వరకు అంటే ‘హరిహర వీరమల్లు’ వచ్చే వరకు ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే సినిమా లేనట్టే..!
సో ‘హరిహర వీరమల్లు’ సినిమా గట్టిగా ఓపెనింగ్స్ రాబట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాల ట్రైలర్స్ కి దక్కాల్సిన ఆదరణ దక్కించుకుంది. సినిమా కూడా అదే మేటర్ లో ఉండేలా.. ఎడిటింగ్ రూమ్లో మేకర్స్ కుస్తీ పడుతున్నారు.
ముఖ్యంగా రన్ టైం విషయంలో చాలా శ్రద్ధ వహించినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ రన్ టైం 2 గంటల 40 నిమిషాలకు లాక్ చేశారట. ఈ మధ్య వచ్చిన ‘కుబేర’ ‘కన్నప్ప’ వంటి సినిమాల రన్ టైం 3 గంటల పైనే ఉన్న సంగతి తెలిసిందే. సో ‘హరిహర వీరమల్లు’ కి ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పాలి.