Naga Chaitanya: సలా ఈ సారి సినిమా హిట్ కొట్టాలి..అంటున్న ఫ్యాన్స్!

అక్కినేని వారసుడు నాగచైతన్య కి ఇటీవల సక్సెస్‌లు లేవు. `బంగార్రాజు` తర్వాత వరుసగా పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన `లాల్‌ సింగ్‌ చద్దా`, `థ్యాంక్యూ`, `కస్టడీ` చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నారు నాగ చైతన్య. అందుకే పరశురామ్‌ సినిమాని కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `కార్తికేయ 2` తర్వాత చందూ మొండేటి నుంచి వస్తోన్న చిత్రమిది.

గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అందులో భాగంగా హీరోయిన్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. అందుకు కీర్తిసురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. నాగచైతన్య సరసన కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అనుపమా పరమేశ్వరన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.

హీరోతో ట్రావెల్‌ అయ్యే రోల్‌ అని కాకపోతే చాలా కీలకంగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఎవరూ ఫైనల్‌ కాలేదని, జస్ట్ టాక్స్ లో ఉందని సమాచారం ఉంది. అయితే ఈ సినిమా కథా నేపథ్యానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా స్టోరీ కి సంబంధించిన ఓ లీకేజీ బయటకు వచ్చింది. ఈ సినిమా మత్య్సకారుల బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట.

శ్రీకాకుళంలోని కళింగపట్నం మత్య్సకారుల కథానేపథ్యంలో (Naga Chaitanya) నాగచైతన్య సినిమా సాగుతుందని, ఈ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా కథకి కీలకం కాబోతుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నాగచైతన్య మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఫస్ట్ టైమ్‌ చైతూ ఒక రా కంటెంట్‌తో రాబోతున్నారని అర్థమవుతుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus