విజయ్‌ సినిమా కోసం ముద్దుగుమ్మలు మాయ చేస్తారట!

కల్ట్‌ సినిమాలు చూడటానిక ఇష్టపడే అభిమానులు, ప్రేక్షకులు.. అలాంటి పాత్రల కోసం హీరోయిన్‌ డీ గ్లామర్‌ అయినా, నెగిటివ్‌ షేడ్స్‌లో నటించినా తట్టుకోలేరు. ‘మా హీరోయిన్‌ ఎప్పుడు బొమ్మలా మెరిసిపోవాలి’ అనుకుంటారు. అలాంటి వారికి షాక్‌ ఇచ్చే వార్త ఇది అని చెప్పొచ్చు. టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కీర్తి సురేశ్‌, సమంత డిఫరెంట్‌ అప్రోచ్‌ ఉన్న రోల్స్‌లో నటిస్తున్నారని టాక్‌. ఎందుకంటే ఆ సినిమా నేపథ్యం అలా ఉండబోతోంది. దర్శకుడు కూడా అలాంటివారే కాబట్టి.

‘విక్రమ్‌’ సినిమాతో ఇటీవల ఇండస్ట్రీలను షేక్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌ త్వరలో విజయ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, కీర్తి సురేశ్‌ను కీలక పాత్రల కోసం తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఏదో పాటల కోసం ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే పాత్రలు కావు అని అని చెబుతున్నారు. ఈ సినిమాలో కీర్తి పాత్ర నిడివి తక్కువ అని చెబుతున్నారు. కానీ పాత్రను తీర్చిదిద్దుతున్న విధానం నచ్చి ఆమె ఓకే చేసిందట. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే ఆ పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక రెండో నాయిక సమంత పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తరహాలో ఇందులో సమంత పాత్రను తీర్చిదిద్దారు అని చెబుతున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా అంటే మాఫియా, డాన్‌లు, అండర్‌ గ్రౌండ్‌లు ఉంటాయి. అందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అంటే.. సమంతను కూడా ఓ డాన్‌గా చూపిస్తారేమో అనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఇటీవల కాలంలో ఛాలెంజింగ్‌ పాత్రల కోసం ఎదురుచూస్తున్న సమంతకు.. లోకేశ్‌ చెప్పిన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది అని టాక్‌.

విజయ్‌తో చేసే సినిమా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ కిందకు వస్తుందా? లేదా ? అనేది చెప్పలేదు కానీ. సినిమా మాత్రం అలాంటి ఛాయల్లోనే ఉంటుంది అని ఇంటున్నారు. ఇప్పుడు వచ్చిన హీరోయిన్ల సమాచారం చూస్తుంటే.. విజయ్‌ సినిమాలో కమల్‌, సూర్య, కార్తి కనపడటం కానీ, వాయిస్‌లు వినబడటం కానీ పక్కా అని చెబుతున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus