‘సైరా నరసింహరెడ్డి’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి ప్రశంసలు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే సినిమాకి ఎంత హిట్ టాక్ వచ్చినా.. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయితే కాలేకపోయింది సైరా.ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం, అలాగే బయ్యర్లకు ఎక్కువ రేట్లకు అమ్మడం మూలాన అంత ఘోరమైన రిజల్ట్ వచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో చాలానే ఉన్నాయని వినికిడి. దీంతో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారనుకుంటే.. ఆ దిశగా చిత్ర యూనిట్ సభ్యులు ముందడుగు వెయ్యలేకపోతున్నారు అనేది ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అదే టైములో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం విడుదల కాబోతుందట. ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఇక మలయాళంలో అయితే మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్’ అనే భారీ బడ్జెట్ చిత్రం అదే టైములో విడుదల కాబోతుందట. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగులో కూడా ఈ రెండు చిత్రాలు డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల కారణంగానే చిరంజీవి ‘ఆచార్య’ ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చెయ్యడం లేదని స్పష్టమవుతుంది.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!