ఉదయ భాను (Udaya Bhanu) అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకున్న మొదటి యాంకర్‌గా కూడా ఉదయ భాను రికార్డులకెక్కింది. ‘వన్స్‌మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జానవులే నెరజాణవులే’, ‘నీ ఇల్లు బంగారంగానూ’ వంటి షోలతో ఈమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సినీ పరిశ్రమకి దూరమైన ఉదయభాను.. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు మెంటర్ గా, జడ్జి గా వ్యవహరించినా పెద్దగా రాణించింది లేదు.
వాస్తవానికి ఈమె కెరీర్ ను ప్రారంభించింది సినిమాలతోనే అనే సంగతి ఎక్కువమందికి తెలిసుండదు. ఆర్.నారాయణ మూర్తి హీరోగా తెరకెక్కిన ‘ఎర్ర సైన్యం’ సినిమాతో ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. అటు తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘లీడర్’ (Leader) ‘జులాయి’ (Julayi) వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా నర్తించింది. అవి కూడా ఈమెకు బ్రేక్ ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన ‘ప్రతినిథి 2’ (Prathinidhi 2) సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది.
అది బాగానే ఉన్నప్పటికీ.. సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఈమెకి కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ‘బార్బరిక్’ అనే సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉదయభాను విలన్ రోల్ పోషిస్తుందట. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘మహారాజా’ (Maharaja) స్టైల్లో సాగే కథ ఇది అని తెలుస్తుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి మారుతి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. జనవరి 3న ‘బార్బరిక్’ టీజర్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా ఉదయభాను మళ్ళీ బిజీ అవుతుందేమో తెలియాల్సి ఉంది.