Udhayanidhi Stalin: సినిమాలకు గుడ్ బై.. ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ డెసిషన్!

ఉదయనిధి స్టాలిన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో తెలుగులో కూడా ఓకే ఓకే అనే డబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే ఈయన తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రం ‘నెంజుకు నీధి’ ఈ సినిమా మే 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఉదయనిధి స్టాలిన్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మామన్నన్‌’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు వంటి స్టార్‌ యాక్టర్స్‌ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ షాకింగ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘మామన్నన్‌’ సినిమానే తన ఆఖరి చిత్రమని ఇకపై తాను సినిమాలకు దూరం అవుతున్నానని ఆయన ప్రకటించారు.

ఈ విధంగా ఉదయ నిధి స్టాలిన్ సినిమాలు చేయనని తేల్చి చెప్పడంతో అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన సినిమాలకు దూరం కావడానికి కూడా ఒక కారణం ఉంది.ఉదయనిధి స్టాలిన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న స్టాలిన్ ఇకపై పూర్తిగా రాజకీయాలలోకి ప్రవేశించాలని సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు.

ఈ విధంగా ఒక వైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో చేయటం వల్ల రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని అందుకే సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని భావిస్తున్నట్లు ఉదయనిధి పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం ఉదయనిది స్టాలిన్ తండ్రి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ కూడా తన తండ్రి బాటలోనే రాజకీయాలలో కొనసాగాలని భావిస్తూ సినిమాలకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus