ఆ 40 సన్నివేశాలు తొలగిస్తే ఏముంటుంది..?

డ్రగ్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉడ్తా పంజాబ్’. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోవలసి ఉంది. అయితే ఈ చిత్రంలో అసభ్యకరపదాలు ఎక్కువ గా ఉన్నాయని, ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వాలసిందిగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ ట్రిబ్యూనల్ లో అప్పీల్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖకు కూడా విన్నవించుకున్నాడు. దాంతో ఈ చిత్రంలోని 40 సన్నివేశాలను తొలగిస్తే ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ సభ్యులు ముందుకు వచ్చారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో ఆ 40 సన్నివేశాలే కీలకమని, వాటిని తొలగిస్తే చిత్రంలో ఏముంటుందని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే వాపోతున్నాడట. ఈ చిత్రం జూలై 17 న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus