కన్నడ స్టార్ ఉపేంద్ర ‘UI ది మూవీ'(Upendra Rao) తో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘2040 లో ప్రపంచం ఎలా ఉంటుంది.జనాలు ఎలా ప్రవర్తిస్తారు’ అనే థీమ్ తో తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఉపేంద్ర. దీనికి దర్శకుడు కూడా ఆయనే. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ (Manoharan) & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ రిలీజ్ చేసింది.
UI Collections:
మొదటి రోజు ఈ సినిమాకి జస్ట్ ఓకే అనే టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇప్పటికీ పర్వాలేదు అనిపిస్తుంది. నిన్న సెకండ్ హాఫ్ ని ఫస్ట్ హాఫ్ లో మిక్స్ చేసినట్టు ప్రకటించారు. దీంతో క్రిస్మస్ హాలిడే రోజు కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.2 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. క్రిస్మస్ హాలిడే ని కూడా ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.