Devara Movie: దేవర గురించి అలాంటి కామెంట్స్ చేసిన ఉమైర్ సంధు.. ఏం జరిగిందంటే?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ తారక్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే దాదాపుగా 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో దేవర సినిమా తెరకెక్కుతుండగా దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా వివాదాల ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఉమైర్ సంధు దేవర మూవీ రషెస్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోలో హీరోగా తారక్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఉమైర్ సంధు దేవర (Devara Movie) గురించి స్పందిస్తూ దేవర సినిమాకు సంబంధించిన పది సెకన్ల రష్ చూశానని తారక్ లుక్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తిందని అన్నారు. దేవర మూవీ ఎపిక్ అని ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. తారక్ ఈ సినిమాలో తండ్రీకొడుకల పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. దేవర మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా తారక్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus