Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » మరుపురాని పెళ్లి చూపులు

మరుపురాని పెళ్లి చూపులు

  • July 28, 2016 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరుపురాని పెళ్లి చూపులు

ఓ అబ్బాయి ఓ అమ్మాయి పెళ్లి పీటలపై కూర్చోవాలంటే పెళ్లి చూపులనే పరీక్షలో ఇద్దరూ పాసవ్వాలి. ఇప్పటి తరంలో కొంత మార్పు వచ్చినా.. ఇదివరకు ఓ శుభ ముహూర్తాన తొలి సారి చూసుకునే వారు. అప్పుడే మాట్లాడుకునే వారు. కొన్ని క్షణాల పరిచయంలోనే జీవితకాలం కలిసి ఉండే భాగస్వామిని ఎంచుకునే వారు. అటువంటి మధురమైన సంఘటనను ఎంతో అందంగా మన దర్శకులు వెండి తెర పైన చూపించారు. మన సినిమాల్లోని వివిధ రకాలైన పెళ్లి చూపుల గురించి ఫోకస్.

చూపులు కలిసిన శుభవేళChoopulu Kalisina Subhavelaఆరోగ్యకరమైన హాస్యానికి మారు పేరు అయిన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఫిల్మ్ “చూపులు కలిసిన శుభవేళ”. నరేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం విచిత్రమైన మేనరిజం తో నవ్వులు పూయించారు. పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిని చూడకుండా స్వీట్స్ తినడంలో నిమగ్నమై హాస్యం తెప్పించారు.

పెళ్లి పుస్తకంPelli Pusthakamబాపు చక్కని వెండి తెర కావ్యం పెళ్లి పుస్తకం. ఇందులో మొదటి సీన్ లోనే పెళ్లి చూపులను రొటీన్ కి భిన్నంగా ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. మేడపైన రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణిలు ఒకరి కొకరు మాట్లాడుకొనే సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అప్పటివరకు సినిమాల్లో ఇరు కుటుంబ సభ్యులను చూపించి ఆ తర్వాత అమ్మాయి, మాట్లాడుకోవడం చూపించేవారు. బాపు మాత్రం రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణి లు ఒకరికొకరు మాటాడుకోవడంతోనే మొదలెట్టి.. ఆణిముత్యం లాంటి సినిమాను అందించారు.

రోజాRojaఅక్కను చూసేందుకు వెళ్లి, పెళ్లి చూపులు అయినా తర్వాత చెల్లెలు నచ్చిందని చెప్పడం .. కథలో గొప్ప ట్విస్ట్. ఆ సీన్ నచ్చింది. సినిమా ఇంకా బాగా నచ్చింది. అందుకే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో “రోజా” వందరోజులు ఆడింది.

పెళ్లి సందడిPelli Sandhadiపెళ్లి చూపులోనే పాటను పెట్టి దర్శకేంద్రుడని నిరూపించుకున్న ఘనుడు కె. రాఘవేంద్ర రావు. పెళ్లి సందడి చిత్రంలో శ్రీకాంత్ పెళ్లి చూపులకు స్వరాలను మిక్స్ చేసి సక్సస్ అందుకున్నారు. ఈ సినిమాలో పెళ్లి చూపుల నుంచే సందడిని మొదలు పెట్టారు.

చందమామChandamamaకృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చందమామ చిత్రం క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో పెళ్లి చూపుల సీన్ ని సహజంగా తీసి విజయం అందుకున్నారు. కాజల్ ని చూసేందుకు శివబాలాజీ వచ్చినప్పుడు అక్కడ జరిగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.

బొమ్మరిల్లుBommarilluతమిళ దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు సినిమా తెరకెక్కించి బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయారు. ఈ చిత్రంలో తండ్రి అతి ప్రేమతో ఇబ్బంది పడే అబ్బాయిగా సిద్దార్ధ్ నటన యువతను ఆకట్టుకుంటుంది. అలాంటి అబ్బాయికి పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అంతే కాదు కాబోయే భార్యతో మనసు విప్పి మాట్లాడుకోవాలని ఆశ పడితే .. “నాన్నగారు చెప్పారండి” అంటూ ఆ అమ్మాయి చెప్పడం.. సిద్దార్ధ్ తనకు వచ్చిన కోపం అణుచుకోవడం.. చూసిన ప్రేక్షకులు అయ్యో పాపం అంటూ జాలి చూపించారు. హీరోకి ఓ హిట్ అందించారు.

జిల్Jilగోపిచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన సినిమా జిల్. ఇందులో వీరిద్దరూ ప్రేమలో ఉన్నా రాశాఖన్నాకు పెళ్లిచూపులు అరేంజ్ చేస్తారు. వచ్చిన సంబంధాన్ని ఎలా తిప్పి పంపాలో తెలియక గోపిచంద్ ని ఇంటికి పిలుస్తుంది రాశీ. ఈ పెళ్లి చూపుల సన్నివేశాన్నిదర్శకుడు కె.రాధాకృష్ణ చాలా కొత్తగా, నేటి తరం యువతీ యువకులకు నచ్చేలా తీసి అభినందనలు అందుకున్నారు.

బెంగాల్ టైగర్Bengal Tigerదాదాపు అన్ని పెళ్లి చూపుల్లో అబ్బాయిలే అమ్మాయితో మాట్లాడాలని పక్కకి తీసుకు పోతారు. విభిన్నంగా ఉండాలని డైరక్టర్ సంపత్ నంది ఆలోచించారు. పెళ్లిచూపులు వెళ్లిన రవితేజని ఆ అమ్మాయి పక్కకి తీసుకెళ్లి సెలిబ్రిటీ కాదని అవమానించి, వార్నింగ్ ఇచ్చే సన్నివేశం మాస్ మహారాజ్ అభిమానులకు భలే నచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bengal Tiger
  • #Bommarillu
  • #Choopulu Kalisina Subhavela
  • #Jil
  • #Pelli choopulu

Also Read

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

related news

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

trending news

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

26 mins ago
ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

2 hours ago
ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

4 hours ago
Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago

latest news

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

21 hours ago
Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

21 hours ago
Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version