‘బాహుబలి’తో ప్రభాస్ స్థాయి పెరిగింది. టాలీవుడ్ హీరో నుండి ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఆ మాటకొస్తే తొలి పాన్ ఇండియా హీరో అని కూడా అనొచ్చు. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు సరైన ఫలితం ఇవ్వకపోయినా.. ఆ ఫేమ్ మాత్రం అలానే కొనసాగుతోంది. ఎంతలా అంటే.. హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియో ఒకటి ప్రభాస్‌తో కాంటాక్ట్‌లో ఉంది అని సమాచారం. అయితే అది హాలీవుడ్ సినిమా కోసమా లేక భారతీయ సినిమా కోసమా అనేది తెలియడం లేదు.
హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సల్ స్టూడియో టీమ్ ఇటీవల ప్రభాస్‌కు టచ్‌లోకి వచ్చిందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని టాక్. ఈమేరకు యూనివర్సల్ స్టూడియో టీమ్ ఒకటి ప్రభాస్‌తో ఇటీవల మీటింగ్ నిర్వహించింది అని అంటున్నారు. హాలీవుడ్లో భారీ సినిమాలతో ఆకట్టుకుంటున్న యూనివర్శల్ స్టూడియోస్ మన దేశంలోకి రావాలని చాలా రోజుల నుండి చూస్తోంది. దాని కోసం హీరోలను కాంటాక్ట్ అవుతోంది అని కూడా వార్తలొచ్చాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్‌తో కూడా యూనివర్శల్ టీమ్ సమావేశమైంది అంటున్నారు. మన దేశంలో సినిమాలు చేస్తామని అంటోంది కానీ, ఆ సినిమాలు మన దేశం కోసమా, లేక ప్రపంచం మొత్తం హాలీవుడ్ సినిమాల తరహాలో చేస్తుందా అనేది తెలియడం లేదు. అయితే యూనివర్శల్ స్టూడియోస్ చేస్తాం అంటోంది పాన్ ఇండియా సినిమాలే అని ఓ వర్గం చెబుతోంది. ఇప్పటికిప్పుడు మన హీరోలతో హాలీవుడ్ సినిమాలు చేసే పరిస్థితి లేదు అనేది వారి మాట.
అయితే మన హీరోల్లో కొంతమంది హాలీవుడ్ మెటీరియల్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రపంచస్థాయి సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు. మరిప్పుడు ప్రభాస్‌ను కలసిన టీమ్ ఏం మాట్లాడింది, ఏం నిర్ణయం తీసుకుంది అనేది తెలియాలి. ఒక వేళ యూనివర్శల్ సినిమాకు ప్రభాస్ ఓకే చెబితే బిజీ లైనప్‌లో ఎక్కడ ఆ సినిమాను ఇరికిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. సో వెయిట్ అండ్ సీ ఫర్ ఫ్యూచర్ అప్డేట్.