కొన్ని సినిమాలు అవడానికి చిన్నవే అయినా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అలాంటి కోవలోకే వచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు కూడా ఒకటి. 2006లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లో మోస్ట్ పాపులర్ మూవీలలో ఒకటి. ఆడియో రిలీజ్ తర్వాత సినిమా పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగి పోగా చిన్న సినిమానే అయినా అల్టిమేట్ బిజినెస్‌ను సాధించింది.
సిద్దార్థ్‌ని లవర్ బాయ్‌గా.. జెనీలియాను హాసినీగా, ప్రకాశ్ రాజ్‌ను నటనలో మరో మెట్టుపైకి ఎక్కించింది. ఈ సినిమాతో దర్శకుడు మామూలు భాస్కర్ కాస్తా బొమ్మరిల్లు భాస్కర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ – సిద్దార్థ్ల మధ్య సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్, పాటలు ఇలా సినిమాలో అన్ని రకాల షేడ్స్ వున్నాయి. ఈ సినిమా విడుదలై 16 ఏళ్ళు గడుస్తోంది. అయినప్పటికీ ఇప్పుడు ప్రసారమైనా ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు.ఇంతటి బ్లాక్ బస్టరైన ఈ చిత్ర కథకు మూలం ఓ పుస్తకమట. ‘ఆమెలో ఏముంది’ అనే బుక్ నుంచి లైన్ తీసుకుని దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ రెడీ చేశారట.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ బుక్ రచయిత కూడా అప్పట్లో కేసు వేసినట్లు పుకార్లు హల్ చల్ చేసాయి. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ వివాదం చల్లారిపోయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత బోమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాక.. మళ్ళీ బొమ్మరిల్లు కథ వివాదం తెరపైకి వచ్చింది. ఏదీ ఏమైనా టాలీవుడ్‌లో రూపొందిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీస్ లో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి అని చెప్పాలి.