మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘యముడికి మొగుడు’. ‘డైనమిక్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై జి.వి.నారాయణ రావు, సుధాకర్ లు కలిసి నిర్మించిన సినిమా ఇది. చిరంజీవి సరసన విజయశాంతి,రాధా వంటి స్టార్ హీరోయిన్లు నటించారు. 1988 వ సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన ఈ చిత్రం విడుదలయ్యింది. బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది ‘యముడికి మొగుడు’ .ఈ రోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 33 ఏళ్ళు పూర్తి కావస్తోంది. కాబట్టి ఈ మూవీ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం రండి :
1) ఈ టైపు కథాంశంతో అప్పటికే పెద్ద ఎన్టీఆర్ ‘యమగోల’ అనే సినిమా చేశారు.అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ‘ ‘యముడికి మొగుడు’ సినిమా ఏం హిట్ అవుతుందిలే’ అని అంతా డౌట్ పడ్డారట.. కానీ అందరికీ షాకిచ్చే విధంగా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
2) 1987లో ‘పసివాడి ప్రాణం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన చిరంజీవి.. మళ్ళీ 1988 లో ‘యముడికి మొగుడు’ చిత్రంతో తన రికార్డులను తనే బద్దలు కొట్టుకున్నాడు.ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ విజయశాంతి కూడా ఓ హీరోయిన్ గా నటించడం.
3)చిరంజీవి రూమ్మేట్స్ మరియు ప్రముఖ నటులు అయిన జి.వి.నారాయణ రావు, సుధాకర్లే ఈ చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం.
4) 1990లలో తమ సంగీతంతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన రాజ్-కోటి లకు ఇదే మొదటి సినిమా!
5) రూ.87 లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించగా ఫుల్ రన్లో రూ.5 కోట్లను(గ్రాస్ తో కలిపి) కలెక్ట్ చేసింది.