10 ఏళ్ల ‘కృష్ణం వందే జగద్గురుమ్’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 30, 2022 / 04:02 PM IST

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధా క్రిష్ణ జాగర్లమూడి తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఫిలిం.. ‘కృష్ణం వందే జగద్గురుమ్’.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద జాగర్లమూడి సాయి బాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. 2012 నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 2022 నవంబర్ 30 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. క్రిష్ తీసిన ఈ సినిమా గురించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

‘గమ్యం’, ‘వేదం’ సినిమాలతో ఆకట్టుకున్న క్రిష్.. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లో రంగస్థల కళకీ, మట్టికీ లింక్ పెడుతూ.. మంచి సందేశాన్నిస్తూనే.. కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్రమ మైనింగ్ వల్ల మట్టికి జరుగుతున్న నష్టాన్ని ఎల్.బి.శ్రీరామ్ మట్టి రాజు క్యారెక్టర్ ద్వారా చూపించిన, చెప్పించిన విధానం బాగుంటుంది.

సమస్య ఉన్న చోటికే వెళ్లే హీరో..

కళనే నమ్ముకుని బ్రతికే ‘సురభి’ సుబ్రహ్మణ్యం (కోట) మనవడు బాబు (రానా) కి నటన కంటే కూడా అమెరికా వెళ్లి సెటిలవ్వాలని ఉంటుంది. అతని కోరిక విన్న తాత గుండె ఆగి చనిపోవడంతో.. తన పొరపాటు తెలుసుకుని.. తాత రాసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ నాటకాన్ని ప్రదర్శించడానికి తన టీంతో కలిసి బళ్లారి వెళ్తాడు. రెడ్డప్ప ఇల్లీగల్ మైనింగ్ స్కాంని బయటపెట్టడానికి వచ్చిన దేవిక (నయనతార) తో బాబుకి పరిచయం ఏర్పడుతుంది. తర్వాత బాబు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ నాటకాన్ని ఎలా ప్రదర్శించాడు.. రెడ్డప్ప మనుషుల ద్వారా బాబు, రెడ్డప్పని చేరుకుని.. ఎలా మట్టిని కాపాడాడు.. అనేది ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు.

ఎమోషనల్ క్యారెక్టర్స్..

రానా పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో అలరించాడు. నయనతార పాత్ర కూడా బాగుంటుంది. కోట, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్.బి. శ్రీరామ్, మిలింద్ గునాజీ, మురళీ శర్మ,.. ఇలా ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. టిప్పు సుల్తాన్ అనే క్యాబ్ డ్రైవర్‌గా ‘లక్ష కోట్లేంటి మేడమ్’ అంటూ పోసాని, రంపం (రంగస్థల పండిట్) గా బ్రహ్యానందం కనిపిప్తారు. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి.

వరించిన అవార్డులు..

సమీరా రెడ్డి చేసిన స్పెషల్ సాంగ్‌లో.. విక్టరీ వెంకటేష్ కనిపించి సర్‌ప్రైజ్ చేస్తారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడంతో ప్రేక్షకాభిమానులు థ్రిల్ ఫీలయ్యారు. సాయి మాధవ్ రాసిన మాటలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింప జేస్తాయి.. జ్ఞాన శేఖర్ వి.ఎస్. విజువల్స్, శ్రవణ్ కఠికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు. బెస్ట్ కాస్ట్యూమ్స్ (తిరుమల), బెస్ట్ మేకప్ (చిట్టూరి శ్రీనివాస్) లకు నంది అవార్డులు.. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కేటగిరీలో కోటకి టీఎస్ఆర్ – టీవీ 9 నేషనల్ ఫిలిం అవార్డ్, బెస్ట్ క్రిటిక్స్ విభాగంలో.. బెస్ట్ హీరో, హీరోయిన్‌గా రానా, నయనతారలకు సైమా అవార్డ్స్ వచ్చాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus