Malli Malli Idi Rani Roju: 8 ఏళ్ళ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఆసక్తికర విషయాలు..!

  • February 7, 2023 / 12:43 PM IST

శర్వానంద్ మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘గౌరి’ ‘సంక్రాంతి’ ‘లక్ష్మీ’.. వంటి హిట్ సినిమాల్లో నటించిన శర్వానంద్.. ఆ తర్వాత ‘వీధి’ ‘గమ్యం’ ‘ప్రస్థానం’ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. శర్వానంద్ కెరీర్లో పలు హిట్ సినిమాలతో పాటు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమాలు.. అరెరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాగుండేది అనిపించే సినిమాలు కూడా ఉన్నాయి.

అలాంటి సినిమాల్లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా తప్పకుండా ఉంటుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎ.వల్లభ నిర్మించారు. నిత్యా మేనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది కానీ పెద్ద సక్సెస్ అందుకోలేదు. 2015 వ సంవత్సరం ఫిబ్రవరి 6న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.అంటే నేటితో 8 ఏళ్ళు పూర్తి కావస్తోందన్న మాట.

కథ పరంగా చెప్పుకుంటే సాధారణమైన ప్రేమ కథ ఇది. కానీ దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బాగుంటుంది. మంచి మంచి సన్నివేశాలు రాసుకున్నాడు అతను. రాజారామ్‌ (శర్వానంద్) ఒక స్పోర్ట్స్ మెన్ . తనతోనే చదువుతున్న నజీరాని (నిత్యా మీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరైనా కానీ ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడిపోతారు. ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఇద్దరూ తాము ప్రేమించిన వాళ్లని మర్చిపోకుండా ఉండలేరు. వాళ్లనే తలుచుకుంటూ జీవిస్తారు. విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటవుతారా లేదా? అన్నది మిగిలిన కథ.

సినిమాలో హైలెట్స్ గురించి చెప్పుకుంటే చాలానే ఉంటాయి. హీరో, హీరోయిన్ల నటన, కెమిస్ట్రీ. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు. గోపీ సుందర్ అందించిన సంగీతం. ఈ సినిమా ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. డీసెంట్ సక్సెస్ ను అందుకుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus