Naga Chaitanya: నాగ చైతన్యకి నాన్న కాకుండా ఏ హీరో అంటే ఇష్టం?..గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సినిమాలు.!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. ‘కింగ్’ నాగార్జున నట వారసుడిగా అక్కినేని ఫ్యామిలీ నుండి థర్డ్ జెనరేషన్ హీరోగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

2009లో ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చై.. రెండో సినిమా ‘ఏమాయ చేశావే’ తో యూత్ ఆడియన్స్‌కి దగ్గరై, ‘100%లవ్’తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా’ వంటి సినిమాల్లో తనలోని మాస్ యాంగిల్ చూపించి ప్రేక్షకాభిమానులను అలరించాడు.

‘సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం, ఒక లైలా కోసం, దోచెయ్, రారండోయ్ వేడుకచూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తాత, తండ్రి, తమ్ముడితో కలిసి నటించిన ‘మనం’, మేనమామ విక్టరీ వెంకటేష్, నాన్న నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించి అలరించిన ‘ప్రేమమ్’, ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘మజిలీ’ చిత్రాలు చైతు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

‘తడాఖా’ తర్వాత వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’తో మెప్పించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే అద్భుతమైన ప్రేమకథా చిత్రంతో ఫ్యాన్స్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. పాండమిక్ తర్వాత భారీస్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిందీ సినిమా. తండ్రితో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీతో 2022 సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ‘థ్యాంక్యూ’ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

బాలీవుడ్ ఎంట్రీ..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సినిమాతో చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే అంతా ఆశ్చర్యపోయారు. మూవీ రిజల్ట్ సంగతి పక్కన పెడితే ‘లాల్ సింగ్ చద్దా’ లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

గెస్ట్ అప్పీరియన్స్..

సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, సుశాంత్ ‘ఆటాడుకుందాం…రా…’, సమంత ‘ఓ..బేబి’.. సినిమాల్లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చి అలరించాడు చైతన్య..

జిమ్, యోగా…

చై.. ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందరిలా ఏదో చెయ్యాలని గంటల తరబడి వర్కౌట్స్ చేయడం కాకుండా.. ఫిట్‌నెస్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండాలి అంటాడు. ఇంట్లో సొంతంగా ఏర్పాటు చేయించుకున్న జిమ్‌లో వర్కౌట్స్, యోగా వంటివి చేయడం చాలా ఇష్టపడతాడు.. టైం చూసుకుని గేమ్స్ కూడా ఆడుతుంటాడు..

బైక్, కార్ రేసింగ్ అంటే క్రేజీ..

చైతన్య గ్యారేజీలో రకరకాల స్పోర్ట్స్ బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి.. రోడ్లు ఖాళీగా ఉండే టైం చూసుకుని.. హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ రోడ్ల మీద రయ్ మంటూ దూసుకెళ్లడమంటే భలే ఇష్టం తనకి..

ఫేవరెట్ స్టార్స్..

మేనమామ విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, దీపికా పదుకోణ్.. అజిత్, సూర్య.. వీళ్లంతా చై ఫేవరెట్ స్టార్స్.. విరాట్ కోహ్లీ ఇష్టమైన క్రికెటర్..

నచ్చే ప్లేసెస్..

మాల్దీవ్స్, దుబాయ్, లండన్, గోవా లాంటి ప్రదేశాలంటే చాలా ఇష్టం.. షూటింగ్ నుండి గ్యాప్ దొరికితే వీటిలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లిపోయి రిలాక్స్ అవుతుంటాడు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus