‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 3 వారాలు పూర్తయ్యింది. ఆల్రెడీ ముగ్గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో నేహా చౌదరి కూడా ఉంది. ‘బిగ్ బాస్ 6’ కి 4వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా చౌదరి మొదట స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించింది కానీ త్వరగానే హౌస్లో నుండి బయటకు వచ్చేసింది.ఆమె హౌస్ లో నుండి బయటకు వచ్చినప్పటి నుండి ప్రతీ బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పే కారణాలే వరుస ఇంటర్వ్యూలలో చెబుతూ హాట్ టాపిక్ అవుతుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే నేహా చౌదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) నేహా చౌదరి తిరుపతిలో పుట్టి పెరిగింది. ఈమె ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి.
2) కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తిచేసిన నేహా చౌదరి.. ఆ తర్వాత గూగుల్ లో కొంతకాలం జాబ్ చేసింది.
3) అటు తరువాత యాంకర్ గా మారి మహా న్యూస్,ఎన్ టీవీ, వనిత టీవీ, హెచ్ ఎం టీవీ, స్టార్ మ్యూజిక్ ఛానల్స్ వంటి వాటిలో పనిచేసింది. మొదట ఈమె యాంకర్ గా మారడానికి ఈమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ ఈమె రిక్వెస్ట్ చేయడం వల్ల ఓకే చెప్పింది.
4) క్రికెట్ ఎక్కువగా చూసేవారికి ఈమె సుపరిచితమే. స్పోర్ట్స్ తెలుగు ఛానల్ కు కామెంటేటర్ గా , యాంకర్ గా కూడా చేసింది.
5) జీ తెలుగులో మంచు లక్ష్మీ హోస్ట్ గా చేసిన షో మహారాణిలో రన్నర్ గా నిలిచింది.
6) అంతేకాదు, 2019 సైమా అవార్డ్స్ కి యాంకర్ గా చేసి మరింత పాపులర్ అయ్యింది నేహా చౌదరి.
7) నిజం అనే టీవీ సిరీస్ లో కూడా ఈమె యాక్ట్ చేయడం జరిగింది. అలాగే అదితి భావరాజు రూపొందించిన ఓ సాంగ్ లో కూడా ఈమె నర్తించింది.
8) చిన్నప్పటి నుండి ఈమె ఎక్కువగా రాగింగ్ వంటివి ఎదురవ్వడంతో కరాటే వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకుంది.
9) యాంకర్ గా, స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా, నటిగా, డాన్సర్ గా, మోడల్ గా, యోగా ట్రైనర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇలా చిన్న వయసులోనే అన్ని విధాలుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
10) నేహా చౌదరి ఇన్స్టాగ్రామ్ ఖాతాకి లక్ష మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండదు.