Maria: మరియా గురించి మనకి తెలియని విషయాలు!

న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో, ఇతర భాషల్లోని నటీనటులకు అవకాశాలివ్వడంలోనూ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. ప్రపంచమంతా మన తెలుగు సినిమాలవైపు చూస్తోంది. అందుకుతగ్గట్టే మన మేకర్స్ కూడా ఇంటర్నేషనల్ హీరోయిన్లను తీసుకొస్తున్నారు. ట్రిపులార్ తో బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకొచ్చారు రాజమౌళి. ఇప్పుడు ఉక్రెయిన్ భామ మరియా కూడా ఇండియన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది.

తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ తో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో తెరకెక్కిన ‘ప్రిన్స్’ మూవీతో మరియా ర్యాబోషప్కా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలకు పరిచయమవుతోంది. పేరు పలకడం కష్టంగా ఉండడంతో అందరూ మరియా అని పిలిచేవారు. ఈ మూవీలో మరియా హీరోయిన్ అనగానే అంతా ఆశ్చర్యపోయారు కానీ ప్రోమోస్, సాంగ్స్ లో తన అందం, అమాయకత్వం చూసి అమ్మడిలో విషయం ఉంది అనుకున్నారు.

ఉక్రెయిన్ లో మోడల్ అయిన మరియా 2018లో ‘ఈథర్’ అనే హలీవుడ్ మూవీతో యాక్ట్రెస్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత 2012లో ‘స్పెషల్ ఓపీఎస్ 1.’ అనే హిందీ వెబ్ సిరీస్ తో ఇండియన్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇక మరియా సొంత దేశమైన ఉక్రెయిన్ విషయానికొస్తే.. తమ దేశానికి, రష్యాకి మధ్య యుద్ధం కారణంగా ఫ్యామిలీకి దూరమైంది. దీని గురించి ‘ప్రిన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టింది.

ఈ సినిమా కోసం ఇండియా వచ్చిన వారానికే ఉక్రెయిన్ లో లాక్ డౌన్ విధించారట. దీంతో తమ ఫ్యామిలీ ఉక్రెయిన్ నుండి వలస వెళ్లిపోయారని వాపోయింది. ఆ యుద్ధంలో ఎంతోమంది చనిపోయారని భావోద్వేగానికి గురైంది. ‘ప్రిన్స్’ మూవీ కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ ని తన దేశంలో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. మన భాష కాకపోయినా, మనకి తన పేరు పలకడం రాకపోయినా కానీ పిల్లది మంచి మనసు అంటూ అందరూ మరియాను ప్రశంసిస్తున్నారు. ‘ప్రిన్స్’ సక్సెస్ అయితే మరిన్ని ఆఫర్స్ మరియా ముందు క్యూ కడతాయి కదా..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus