‘బిగ్ బాస్ 6’ స్టార్ట్ అయ్యి రెండు వారాలు దాటింది. ఇప్పుడు షో రసవత్తరంగా మారుతుంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ ముసుగుల్ని తీసి గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఆల్రెడీ షాని, అభినయ శ్రీ వంటి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో 3వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్. లాస్ట్ సీజన్ లో సిరి బాయ్ ఫ్రెండ్ గా స్టేజ్ పైకి వచ్చిన ఇతను ఈసారి ఓ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.చాలా వరకు సైలెంట్ గా ఉన్నప్పటికీ అక్కడక్కడ అగ్రెసివ్ గా ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇతని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) 1988 వ సంవత్సరం అక్టోబర్ 19న ఇతను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించాడు.
2) వైజాగ్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఇతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు.చదువు పూర్తయ్యాక శ్రీహన్ ఇండియన్ నావిలో మూడు ఏళ్ల వరకు పని చేశాడు.
3) అయితే అతనికి చిన్నప్పటి నుండి నటుడవ్వాని ఉండేది. అందుకే 2015లో ‘చారి లవర్ ఆఫ్ శ్రావణి’ అనే షార్ట్ ఫిలింతో తన యాక్టింగ్ కెరీర్ ను మొదలు పెట్టాడు.అందులో ఇతని సరసన సిరి హనుమంతు నటించింది.
4) అటు తర్వాత ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాడు’ అనే సీరిస్ లో కూడా ఇతను నటించాడు.యూట్యూబర్ గా ఇతను ఎక్కువ పాపులర్ కాలేదు.
5) కొన్నాళ్ల తర్వాత ఇతనికి ఈటీవీ ప్లస్ లో కూడా అవకాశం వచ్చింది. ‘అమ్మాయి క్యూట్ అబ్బాయి నాట్’ , ‘పిట్టగోడ’ వంటి సీరియల్స్ లో నటించాడు.
6) శ్రీహాన్ నటుడు, యూట్యూబర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా..! స్టేజి పైకి ఎంట్రీ ఇస్తూనే పాట పాడి నాగార్జునతో పాటు ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్ చేశాడు.
7) ఇతను ముస్లిం అని ఎక్కువ మందికి తెలిసుండదు. శ్రీహాన్ తల్లి పేరు పర్వీన్ షేక్, తండ్రి పేరు అమీర్ ఎస్.కె.
8) శ్రీహాన్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. ‘బిగ్ బాస్ 5’ లో షణ్ముఖ్- సిరి ల రిలేషన్ గురించి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఇతను చాలా పాజిటివ్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.
9) సిరి, శ్రీహాన్ లు పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించారు.వీరు ఓ బాబుని కూడా దత్తత తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
10) ఇక శ్రీహాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది.
‘బిగ్ బాస్ 6’ లో ఇతను ఒక్కో రోజుకు రూ.40 వేల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
మరి బిగ్ బాస్ 6 లో ఇతను ఎన్ని రోజులు కొనసాగుతాడు? టాప్ 5 లో ఉంటాడా? లేదా? .. ‘బిగ్ బాస్’ ఇతని కెరీర్ కు ఎంత వరకు ప్లస్ అవుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.