శ్రీను వైట్ల (Nee Kosam) .. ఇప్పటి జనరేషన్ కి మీమ్ గాడ్ గా మాత్రమే తెలిసి ఉండొచ్చు. లేదు అంటే ‘ఆగడు’ (Aagadu) ‘బ్రూస్ లీ’ (Bruce Lee) ‘మిస్టర్’ (Mister) ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) వంటి డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడిగానే తక్కువ చేసి చూస్తుండొచ్చు. ‘విశ్వం’ (Viswam) తో హిట్టు కోసం పరితపించిన దర్శకుడిగా ప్రస్తావించొచ్చు. కానీ ఈయన ‘బాద్ షా’ (Baadshah) వరకు ఆయన రేంజ్ వేరు. శ్రీను వైట్ల (Srinu Vaitla) కెరీర్ కూడా చాలా మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో ఆయన పడ్డ స్ట్రగుల్స్, మొదటి అవకాశం, వరుస విజయాలు వంటివి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. నేటితో శ్రీను వైట్ల దర్శకుడిగా మారి 20 ఏళ్ళు అయ్యింది. ఆయన డైరెక్షన్ చేసిన మొదటి సినిమా ‘నీకోసం’ 1999 డిసెంబర్ 3న విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం :
1) ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి, కందులపాలెం అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను.శ్రీను వైట్ల వాళ్ళు మొత్తం 5 మంది అన్నదమ్ములు. వీళ్ళలో శ్రీను వైట్లకి చిన్నప్పటి నుండి సినిమాలంటే బాగా ఇష్టం. కాకినాడలో చదువుకునే రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసేవాడు.
2) శ్రీను వైట్లకి సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మణిరత్నం (Mani Ratnam) సినిమాల్లో ఉండే ఫ్రేమ్స్ అంటే శ్రీను వైట్లకి చాలా ఇష్టం.
3) ఇక సినిమాలపై ఉన్న ఇష్టం తగ్గకపోవడంతో శ్రీను వైట్ల మద్రాసు ట్రైన్ ఎక్కేశాడు. అక్కడ అతనికి ఎవ్వరూ తెలీదు. దీంతో అక్కడ చాలా అవస్థలు పడ్డాడు. చివరికి ఒకసారి భోజనం కోసం వెళ్ళినప్పుడు అతనికి కృష్ణవంశీ (Krishna Vamsi) పరిచయం అయ్యాడు. ఇద్దరూ తెలుగువాళ్లే కావడంతో ఫ్రెండ్స్ అయ్యి రూమ్ మేట్స్ అయిపోయారు. తర్వాత రెండు నెలలకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు శ్రీను వైట్ల.
4) గోగినేని సుబ్బారావు ద్వారా చలసాని రామారావు అనే డైరెక్టర్ వద్ద ‘ప్రాణానికి ప్రాణం’ (Prananiki Pranam) అనే సినిమాకు పనిచేసే ఛాన్స్ వచ్చింది.
5) ఆ తర్వాత రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) వద్ద అసిస్టెంట్ గా చేరాలని అనుకున్నాడు కానీ కుదరలేదు. దీంతో మరో డైరెక్టర్ సాగర్ వద్ద ‘నక్షత్ర పోరాటం’ ‘అమ్మదొంగా’ వంటి సినిమాలకు పని చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అక్కడ ఇతనికి వి.వి.వినాయక్ (V. V. Vinayak) పరిచయమయ్యాడు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దగ్గర కూడా పనిచేశారు.
6) ఇక 1999 లో రామోజీ రావు (Ramoji Rao) గారిని ఇంప్రెస్ చేసి ‘నీకోసం’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు శ్రీను వైట్ల. జెడి చక్రవర్తిని (J. D. Chakravarthy) హీరోగా పెట్టుకోవాలని ట్రై చేశాడు. కానీ కుదరకపోవడంతో తన మ్యూచువల్ ఫ్రెండ్ అయిన రవితేజని పెట్టి ఆ సినిమా చేశాడు. 28 రోజుల్లో 37 లక్షల బడ్జెట్ లో ఆ సినిమాని ఫినిష్ చేశాడు శ్రీను వైట్ల. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద లిమిటెడ్ రిలీజ్ లో కూడా కోటి రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
7) తర్వాత ఆ సినిమా చూసి నాగార్జున (Nagarjuna).. శ్రీను వైట్లకి ఫోన్ చేశారు. ‘సినిమా బాగుంది కానీ అందులో కామెడీ లేదు’ అనే కంప్లైంట్ రావడంతో.. శ్రీను వైట్లకి కామెడీపై శ్రద్ధ పెరిగింది. ఈవీవీ గారి శిష్యుడు కాబట్టి అది అతనికి ఇట్టే వచ్చేసింది. అదే శ్రీను వైట్లకి పెద్ద బలం అయిపోయిందని ‘ఆనందం’ ‘సొంతం’ సినిమాలతో ప్రూవ్ అయ్యింది
8) ఇక అటు తర్వాత ‘వెంకీ’ (Venky) ‘ఢీ’ (Dhee) ‘దుబాయ్ శీను’ (Dubai Seenu) ‘రెడీ’ (Ready) వంటి బ్లాక్ బస్టర్లు శ్రీను వైట్ల ఖాతాలో పడ్డాయి. అతన్ని స్టార్ డైరెక్టర్ ని చేశాయి.
9) సీనియర్ స్టార్ హీరోల్లో చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున, వెంకటేష్ (Venkatesh )..లతో సినిమాలు చేసిన శ్రీను వైట్ల.. బాలయ్యతో (Nandamuri Balakrishna) మాత్రం సినిమా చేయలేదు.
10) నటుడిగా మాత్రం బాలయ్య నటించిన ‘పరమ వీర చక్ర’ (Parama Veera Chakra) సినిమాలో చిన్న పాత్ర పోషించాడు శ్రీను వైట్ల. అలాగే ‘రెయిన్ బో’ అనే సినిమాలో కూడా చిన్న అతిథి పాత్ర పోషించాడు
11) అయితే ‘కింగ్’ (King) ‘నమో వెంకటేశ’ (Namo Venkatesa) సినిమాలతో కొంచెం డల్ అయినట్టు కనిపించినా.. ‘దూకుడు’ (Dookudu) తో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి అతని మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు.
12) ఆ తర్వాత వచ్చిన ‘బాద్ షా’ కూడా బాగా ఆడింది. అయితే తర్వాత ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల కెరీర్ కాస్త వెనుకపడింది.
13) ఇటీవల ‘విశ్వం’ తో బిలో యావరేజ్ రిజల్ట్ నే అందుకున్నాడు కానీ హిట్టు కొట్టలేదు. అయినప్పటికీ శ్రీను వైట్ల పెన్ పవర్ తగ్గలేదు అని ‘విశ్వం’ తో ప్రూవ్ అయ్యింది. రాబోయే రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.