Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారాయన. ‘హీరోగా రాజశేఖర్ (Rajasekhar) పని అయిపోయింది… ఇక కష్టమే’ అని ప్రేక్షకులు అనుకున్న ప్రతిసారి ఓ సాలిడ్ హిట్ కొట్టి ఫామ్లోకి వస్తుండేవారు రాజశేఖర్. ‘మనసున్న మారాజు’ ‘మా అన్నయ్య’ ‘సింహరాశి’ ‘ఎవడైతే నాకేంటి’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించి రాజశేఖర్ బాక్సాఫీస్ స్టామినాని ప్రూవ్ చేస్తూ వచ్చాయి. 2007 లో వచ్చిన ‘ఎవడైతే నాకేంటి’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Gorintaku

అదొక మాస్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. అలాంటి హిట్ పడ్డ తర్వాత.. ‘గోరింటాకు’ అనే ఫ్యామిలీ సినిమా చేశారు రాజశేఖర్ (Rajasekhar) . నాగార్జునకి ‘నువ్వు వస్తావని’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. కన్నడంలో శివరాజ్ కుమార్ నటించిన ‘అన్న తంగి’ అనే సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ‘గోరింటాకు’. 2008 జూలై 5న రిలీజ్ అయ్యింది.

మొదట్లో ఈ సినిమాని ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. క్లైమాక్స్ లో చాలా ట్రాజడీ ఉంటుంది. మొదటి వారం పెద్దగా కలెక్షన్స్ రాలేదు ఈ సినిమాకి. అయితే సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన ఆకాష్.. చెల్లి పాత్ర చేసిన మీరా జాస్మిన్ తో ‘మీ అన్న చెబితే కుంటోడు, గుడ్డోడుని కూడా పెళ్లి చేసేసుకుంటావా?’ అనే ఓ డైలాగ్ ఉంటుంది. దానికి పెద్ద రచ్చ జరిగింది.

ఆ డైలాగ్ ను తొలగించాలని హ్యూమన్ రైట్స్ అధికారులు డిమాండ్ చేశారు.ఈ క్రాంట్రోవర్సీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. తర్వాత జనాలు థియేటర్లకు బాగా వెళ్లారు. కలెక్షన్స్ బాగా వచ్చాయి. కట్ చేస్తే ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 6 ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా. ఒక చిన్న వివాదం ఈ సినిమాకి ఆ టైంలో అలా కలిసొచ్చింది అని చెప్పాలి.

‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus