అరచేయి అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరు అన్నట్టుగానే.. సినిమాలో సత్తా లేనిదే.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, టాప్ టెక్నీషియన్లు ఉన్నంత మాత్రాన అసలు కథలో విషయం లేనప్పుడు.. ఈ హంగూ ఆర్భాటాలేవీ సదరు మూవీని డిజాస్టర్ కాకుండా ఆపలేవు.. విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందని అందుకే అన్నారేమో మరి.. తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పటికి స్టార్ హీరోయిన్‌గా ఉన్న రోజా..
తర్వాత తానే నిర్మాతగా మారి.. భర్త డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేశారు. తమిళ్‌లో ‘అథిరడి పడై’, తెలుగులో ‘సమరం’ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. అప్పటికి మాంచి ఫామ్‌లో ఉన్న సుమన్ హీరో.. రఘు, రోజా, పునీత్ ఇస్సార్, కైకాల, కోట, బాబు మోహన్, సిల్క్ స్మిత తదితరులు నటీనటులు.. మేస్ట్రో ఇళయరాజా సంగీతం.. ఎస్.పి. బాలు, ఎస్.జానకి సింగర్స్.. భువనచంద్ర పాటలు, సూపర్ సుబ్బరాయన్ ఫైట్స్.. ఇలా భారీగానే సెట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీ బడ్జెట్‌తో అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే పెట్టి నిర్మించారు. శ్రీసాయి రోజా ప్రొడక్షన్స్ అని రోజా పేరు మీద బ్యానర్ ఉన్నా నిర్మాతగా వై. కుమార స్వామి రెడ్డి పేరు వేశారు. సుమన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన ‘సమరం’ 1994లో రిలీజ్ అయింది. కట్ చేస్తే.. మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తలా తోకా లేని కథ, కథనాలు..
దర్శకుడు చెప్పిందేదో చేసుకుపోయాం అన్నట్లుండే నటీనటుల పని తీరు.. ఇలా పలు కారణాలతో అవుట్ పుట్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా కానీ ఈ కళాఖండాన్ని జనాల మీదకి వదిలారు. నిర్మాతగా రోజా భారీగా చేతులు కాల్చుకుంది.. తీసింది భర్తే కాబట్టి ఏమీ అనలేని పరిస్థితి.. అంతే, దెబ్బకి మళ్లీ నిర్మాణం జోలికి పోలేదు.. కాకపోతే ఈ ‘సమరం’ ఓపెనింగ్, బడ్జెట్‌కి సంబంధించిన విశేషాలు అప్పట్లో ఫిలిం వర్గాల్లో బాగా చక్కర్లు కొట్టాయి.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..