Actress Srividya: ఒకప్పటి నటి శ్రీవిద్య చనిపోయే ముందు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా?

సినీతారలను దైవంలా భావించి వారికి గుడులు కట్టి పూజించేంత అభిమానం మనది. కానీ సినీ రంగం పైకి కనిపించేలా రంగుల ప్రపంచం కాదు. మనల్ని రెండున్నర గంటల పాటు ఎంటర్‌టైన్ చేయడానికి నటీనటులు ఎంతో శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారే కాదు.. ప్రాణాలే కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక అంగవైకల్యంతో జీవితాంతం నరకయాతన పడిన నూతన్ ప్రసాద్ లాంటి వారికి కూడా కొదవ లేదు. అయితే చిత్ర పరిశ్రమలోని హీరో హీరోయిన్లు పైకి కనిపించినట్లుగా సంతోషంగా వుండరు. తీరని వ్యధ, మానసిక కృంగుబాటుతో నిత్యం సతమతమయ్యేవారు ఎందరో.

అలాంటి వారిలో ఒకప్పటి నటి శ్రీవిద్య కూడా ఒకరు.ఎన్నో కలలతో సినిమాలో అడుగుపెట్టిన శ్రీవిద్య జీవితం చివరికి విషాదంగా ముగిసింది. మలయాళం, తెలుగు , తమిళ, కన్నడ , హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 800 పైగా సినిమాలో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీవిద్య ఆపై సపోర్టింగ్ రోల్స్, అక్క, చెల్లి, అమ్మ, అత్తా క్యారక్టర్లతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యం గా ఆమె కళ్లతో పండించే భావోద్వేగాలు ప్రత్యేక ఆకర్షణగా .. ఆ పాత్రకి నిండుతనం తెచ్చే విధంగా ఉండేవి .ఈమెలో మంచి సింగర్ కూడా ఉంది. తన మధుర గాత్రంతో ప్రేక్షకులను అలరించింది, అలాగే ఎంతోమందికి డబ్బింగ్‌ కూడా చెప్పింది.

1953 జులై 24న మద్రాస్‌లో పుట్టారు శ్రీవిద్య. ఆమె తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్ గా రాణించారు.ఈమె తల్లి పేరు వసంత కుమారి. ఆమె ఓ కర్ణాటక క్లాసిక్ సింగర్. శ్రీవిద్య పుట్టిన కొన్నేళ్లకు ఆమె తండ్రికి పక్షవాతం రావటంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె తల్లి వసంత కుమారి ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని పోషించింది. అందుకే శ్రీవిద్య చదువు మధ్యలోనే ఆపేసింది. తన తండ్రి రిఫరెన్స్ లతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. శివాజీ గణేషన్‌ హీరోగా నటించిన తిరువరుచెల్వార్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ” తాత మనవడు” తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తర్వాత ఆ స్టార్ డమ్ తగ్గుతూ వచ్చిన తరుణంలో ప్లేబాక్ సింగర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగించింది.ఇక ఈమె కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్‌తో ఎక్కువ సినిమాలు చేసింది. ఒకానొక దశలో కమల్‌తో ప్రేమలో పడింది కూడా. అయితే అప్పటికే కమల్ … వాణీ గణపతితో ప్రేమలో ఉండటంతో ఈమె తప్పుకోవాల్సి వచ్చింది.కొన్నాళ్ల తర్వాత మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌ను ప్రేమించి తల్లిదండ్రుల మాట వినకుండా అతన్ని పెళ్లి చేసుకుంది.అతని కోసం మతం మార్చుకుని సినిమాలకి సైతం గుడ్ బై చెప్పింది.కానీ భర్త డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో మళ్ళీ మేకప్ వేసుకుంది. అయినా ఆమె వేధిస్తుండడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది.తర్వాత కొన్నాళ్ళకి మలయాళ దర్శకుడు భరత్‌తో మళ్ళీ ప్రేమలో పడింది.కానీ కొన్నాళ్ళకి ఈమె కాన్సర్‌ భారిన పడడంతో మళ్ళీ నటనకి దూరం కావాల్సి వచ్చింది.అంతేకాదు ఈమె సంపాదించింది మొత్తం సేవా కార్యక్రమాలకు రాసిచ్చేసింది.2006 లో ఈమె ప్రాణాలు విడిచింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus