దశాబ్దం క్రితం వచ్చిన బొమ్మరిల్లు మూవీ ఓ సెన్సేషన్. యూత్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన, నచ్చిన చిత్రంగా బొమ్మరిల్లు నిలిచింది. హీరో సిద్దార్ధ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు. నచ్చింది చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీ లైఫ్ అనుభవించే హాసినిగా జెనీలియా తెలుగు ప్రేక్షకుల తెగనచ్చేసింది. హాసిని-సిద్ధుల రొమాంటిక్ లవ్ ట్రాక్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ కలగలిపిన పర్ఫెక్ట్ బ్లెండ్ బొమ్మరిల్లు మూవీ. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన సాంగ్స్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. బొమ్మరిల్లు ఫాథర్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఈ సినిమాతో ఏర్పడింది.
అంతగా ప్రకాష్ రాజ్ ఓవర్ కేరింగ్ డాడీ పాత్రలో జీవించారు. ఫ్రస్ట్రేటెడ్ కొడుకుగా సిద్ధార్ధ్ కూడా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. కొడుకుకి అన్ని తానై నడిపించాలనుకునే తండ్రికి, దాని వలన సొంత ఐడింటిటీ లేక ఆవేదన పడే కొడుకుకి మధ్య నడిచే ఎమోషన్ డ్రామా దర్శకుడు భాస్కర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సన్నివేశంలో పాత్రలు పలికే డైలాగ్స్ ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళతాయి. ఐతే ఇంత గొప్ప సీన్ తెరకెక్కడానికి ముందు చిన్న డ్రామా నడిచిందట.
క్లైమాక్స్ రేపు షూట్ చేయాల్సివుండగా, ఒకరోజు ముందే సీన్ పేపర్ తీసుకున్న ప్రకాష్ రాజ్, దర్శకుడు చెప్పిన ఫీల్ ఇందులో కనిపించడం లేదు, షూటింగ్ క్యాన్సిల్ మార్పులు చేయమనండి అన్నారట. ఐతే ప్రకాష్ రాజ్ ని కన్విన్స్ చేసి, నెక్స్ట్ డే ఆ సన్నివేశాన్ని సింగిల్ షాట్ లో తీశారట. సినిమాకే హైలెట్ అయిన ఈ సన్నివేశంపై అనేక సినిమాల్లో, సోషల్ మాధ్యమాలలో వందల మీమ్స్ ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా బొమ్మరిల్లు మూవీ 2006 ఆగస్టు 9న విడుదలైంది.