ప్రభాస్ (Prabhas) గురించి చెప్పుకుంటే, ఆయన సింప్లిసిటీ మర్యాద మంచితనమే చాలా గొప్పవని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు కూడా ‘డార్లింగ్’ అని పిలుస్తుంటారు. ప్రభాస్ తన కెరీర్‌ను చిన్న సినిమాలతోనే ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ (Baahubali) సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రభాస్, తన సింప్లిసిటీ, హార్డ్ వర్క్‌తో పాన్ ఇండియా హీరోగా నిలిచిపోయాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చేవరకూ చాలా మంది అతనిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
‘‘నువ్వు హీరో అవుతావా?’’ అని కొంతమంది స్నేహితులు సైతం నవ్వుకునేవారట. ఇక ఈ రోజు అతని తపన, పట్టుదల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. మొదట హీరో కావాలని అనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయినా, చివరికి ఆయనకి అండగా నిలబడ్డారు. దాంతో ప్రభాస్ విశాఖపట్నం లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి తన నటనలో మంచి గ్రిప్ సాధించాడు.
ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే, 2002లో వచ్చిన ‘ఈశ్వర్’ (Eeswar) సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, ప్రభాస్ నటన అందరికి నచ్చేసింది. అతని మాస్ అప్పీల్, సింప్ల్ కమ్ స్ట్రాంగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత వచ్చిన ‘వర్షం’ (Varsham) సినిమాతో ఆయన కెరీర్ దూసుకుపోయింది. ఛత్రపతి’(Chatrapathi), ‘మిర్చి’ (Mirchi) , ‘రెబెల్’ (Rebel) వంటి చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించడంతో ప్రభాస్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు.
ప్రభాస్ గురించి చెప్పే మరో ఆసక్తికర విషయం, బాహుబలి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. 5 సంవత్సరాల పాటు ఒక్క సినిమా మీదే ఫోకస్ చేసి, తన కెరీర్‌ని పక్కన పెట్టాడు. అలాంటి సాహసం అతనే చేయగలడని నిరూపించాడు. బాహుబలి ఘనవిజయం సాధించడం తర్వాత, ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వరుసగా ‘సలార్ 2’ (Salaar), ‘కల్కి 2’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (The Rajasaab) వంటి చిత్రాలతో రాబోతున్నాడు.