శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రధారులుగా రాజ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన చిత్రం “అమరన్” (Amaran). 2014లో ఓ మిలిటెంట్ ఆపరేషన్ లో దేశ భద్రత కోసం ప్రాణాలు విడిచిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ ఎనౌన్స్ మెంట్ నుండి మంచి ఆసక్తిని నెలకొల్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా విడుదలవుతున్న “అమరన్” ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేసారు. కాస్త అడివి శేష్ (Adivi Sesh) నటించిన “మేజర్” (Major) ఛాయలు కనిపించినప్పటికీ..
మేకింగ్ & ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఓపెన్ షాట్ లో ముకుంద్ తన కూతురుతో ఆడుకుంటున్న వీడియో నుండి సినిమాకు ఇచ్చిన ట్రాన్సిషన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఈ ఫార్మాట్ లోనే ఉండడం విశేషం. ఇక జమ్మూకాశ్మీర్ ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఎపిసోడ్స్ & శివకార్తికేయన్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం హైలైట్ అనే చెప్పాలి.
ముకుంద్ తమిళనాడుకు చెందిన సైనికుడు, 2014లో మరణించిన ముకుంద్ కు అప్పటి తమిళనాడు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికిన విధానం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ముకుంద్ ప్రదర్శించిన ధైర్య పాఠవానికి ప్రతీకగా ఆయన మరణానంతరం ప్రకటించిన అశోక చక్ర ఆయన ఖ్యాతిని మరింత పెంచింది. కమల్ హాసన్ లాంటి అత్యుత్తమ ఫిలిం మేకర్ ఈ సినిమాని నిర్మించడం, శివకార్తికేయన్ ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లు వెచ్చించి కష్టపడడం,
రాజ్ కుమార్ (Rajkumar Periasamy) టేకింగ్ & సాయి పల్లవి స్క్రీన్ ప్రెజన్స్ “అమరన్”కు (Amaran)మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. సినిమా ఏమాత్రం బాగున్నా.. “మేజర్”ను మించిన స్థాయి విజయం సాధించడం ఖాయం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించాల్సి ఉంది.