నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ చక్రవర్తి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు సినిమాల్లో నటించి కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కళ్యాణ్ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవితో కలిసి లంకేశ్వరుడు సినిమాలో నటించారు. హీరోగా మంచి గుర్తింపు వస్తున్న సమయంలోనే కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరం కావడం గమనార్హం.
సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించిన కళ్యాణ్ చక్రవర్తి భక్త కబీర్ దాస్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. అయితే తండ్రి వల్లే కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరమయ్యారు. కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందగా అదే యాక్సిడెంట్ లో త్రివిక్రమరావుకు కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనతో షాక్ కు గురైన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరమై చెన్నెలోనే ఉంటూ వ్యాపారాలను చూసుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఈ హీరో చెన్నైకే పరిమితమయ్యారు. కళ్యాణ్ చక్రవర్తి నటుడిగా కెరీర్ ను కొనసాగించి ఉంటే కచ్చితంగా స్టార్ హీరో అయ్యేవారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ కావడం గమనార్హం.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్