Nikhil Maliyakkal: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ నిఖిల్ మలియక్కల్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు?
- September 3, 2024 / 04:39 PM ISTByFilmy Focus
‘బిగ్ బాస్ 8’ సెప్టెంబర్ 1 న ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో ప్రారంభమైంది. ఈ సీజన్లో 2వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal) . యష్మీ గౌడతో (Yashmi Gowda) కలిసి ఇతను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చూడటానికి చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. బుల్లితెర ప్రేక్షకులకి ఇతను కూడా సుపరిచితమే. పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ఇతను అద్భుతంగా డాన్స్ చేసి స్టేజిపైకి వచ్చాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
Nikhil Maliyakkal

జూన్ 28 న ఇతని బర్త్ డే. కర్ణాటకలోని మైసూర్లో.. ఇతను పుట్టిపెరిగాడు.
నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్. అతని పేరు శశి. ఇక తల్లి పేరు సులేఖ. ఈమె కూడా నటే.పలు కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది.
నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూర్లోనే జరిగింది. బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఇతను పనిచేశాడు.
2016 లో వచ్చిన ‘ఊటీ’ అనే కన్నడ సినిమాతో ఇతను నటుడిగా మారాడు.
అటు తర్వాత 2018 లో వచ్చిన ‘మనేయే మంత్రాలయ’ అనే కన్నడ సీరియల్ తో ఇతను బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ‘గోరింటాకు’ సీరియల్ తో ఇతను (Nikhil Maliyakkal) తెలుగు సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ అనే సీరియల్లో కూడా నటించాడు. సోషల్ మీడియాలో నిఖిల్ కి లక్షకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిజికల్ టాస్కుల్లో కూడా ఇతను బాగా ఆడగలను అనే కాన్ఫిడెన్స్ తో హౌస్లోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. చూస్తుంటే చాలా స్ట్రాటెజీలతో గేమ్ ఆడేలా కనిపిస్తున్నాడు.















